గోవుల తలలపై సుత్తులతో బాది చంపేస్తూ..!

పంజాబ్ రాష్ట్రంలో గోవులను వధిస్తున్న అక్రమ కబేళాను పోలీసులు కనుగొన్నారు. గోవులను అతి దారుణాతి దారుణంగా చంపేస్తూ ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురుదాస్పూర్ జిల్లాలోని ధారివాల్ ప్రాంతంలో అక్రమంగా ఈ కబేళాలను ఉంచారు. అక్కడ 11 మంది నిందితులను ఆవులను వారి తలలను సుత్తితో కొట్టి దారుణంగా చంపినందుకు అరెస్టు చేశారు. 10 రోజుల క్రితం పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్, గోశాలలలో ఆవులను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి లూధియానాలో గోసంరక్షణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి అక్రమ కబేళాలపై పంజాబ్ ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టింది.

సోమవారం రాత్రి గురుదాస్పూర్ ఎస్ఎస్పి డాక్టర్ నానక్ సింగ్ సూచన మేరకు 40 మంది పోలీసు సిబ్బంది, అధికారుల బృందం అక్రమ కబేళాలపై దాడి చేసింది. పోలీసు బృందం ఇక్కడికి చేరుకున్నప్పుడు ఓ భారీ వస్తువు వల్ల తలకు గాయాలై చనిపోయిన మూడు ఆవులు కనిపించాయి. వాటి తలపై భారీ సుత్తితో మోది చంపేస్తున్నారని అధికారులు తెలుసుకున్నారు. గాయపడిన ఆవులను కనుగొని.. మరో నాలుగు ఆవులను రక్షించారు.

నిందితులు ఈ ఆవులను ముక్కు రంధ్రాలు మరియు కాళ్ల ద్వారా బంధించాడు. భరించలేని వాసనల మధ్య మూడు గంటల పాటు రైడ్ కొనసాగింది. ఈ సమయంలో పోలీసులు పెద్ద మొత్తంలో ఆఫాల్, ఎముకల కుప్ప, ప్రాసెస్ చేయని మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా కాలంగా ఇక్కడ గోవుల వధ జరుగుతోందని ఆధారాలు సూచించాయి. అరెస్టయిన నిందితులలో ధాలివాల్లోని తరిజనగర్కు చెందిన నియమత్ మసిహ్, అతని కుమారుడు రవి గోవుల వధకు సూత్రధారులుగా ఉన్నారు. ధరివాల్ ప్రాంతానికి చెందిన విక్కీ మసీహ్, రవి, థామస్ మసీహ్, జైసం మసీహ్, జానీ, బాల్కర్ మసీహ్ ఇతర నిందితులుగా గుర్తించారు. మిగిలిన ముగ్గురు నిందితులు వసీం, నాసక్, తన్వీర్ లు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్పూర్ జిల్లా నానాజూటా గ్రామానికి చెందినవారు. నిందితులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960, పంజాబ్ గో వధ చట్టం 1955 ఐపిసి 295, 428 మరియు 429 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. వారి వద్ద నుండి సుత్తులు, కత్తులు మరియు ఇతర పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీకి పంపబడ్డారు. గాయపడిన ఆవును చికిత్స కోసం స్థానిక పశు వైద్యశాలకు తరలించగా.. చనిపోయిన ఆవులను పోస్టుమార్టం కోసం పంపించారు.
కల్యాణ్పూర్లో ఆవులను కొందరు వ్యక్తులు వధిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. సమాచారాన్ని ధృవీకరించిన తరువాత DSP రాజేష్ కక్కడ్, CIA ఇన్ఛార్జ్ విశ్వామిత్ర, గురుదాస్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ జితేంద్ర కుమార్, ధరివాల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అమందీప్ సింగ్తో కూడిన బృందంగా ఏర్పడి రైడ్ ను మొదలుపెట్టారు.