More

    బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చి హ్యాపీగా మిల్లులో పని చేస్తూ ఉన్నారు.. ఇంకా దేశంలో ఎంత మంది దాగారో..!

    మహారాష్ట్రలోని థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జిల్లాలోని భివాండి తహసీల్ పరిధిలోని సరావలి గ్రామంలోని టెక్స్‌టైల్ మిల్లులో పనిచేస్తున్న తొమ్మిది మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు అవని టెక్స్‌టైల్ ఆవరణలో వీరిని అరెస్టు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం వారిని ఏ ప్రాతిపదికన నియమించింది అనే విషయమై కూడా విచారణ చేస్తున్నారు. వారి ఆధారాలు మరియు నేపథ్యాలు ధృవీకరించుకోకుండానే ఉద్యోగాలు ఇచ్చారా అనే విషయమై కూడా ఆరాతీస్తున్నారు. అక్రమంగా వలస వచ్చిన వారిని సలీం షేక్ అలియాస్ అస్గర్ (30), రసల్ షేక్ (27), షాహీన్ షేక్ (24), మసూమ్ ఇస్లాం (21), తరుణ్ త్రిపుర (21), సుమన్ త్రిపుర (25), ఇస్మాయిల్ ఖాన్ (19),ఆజం ఖాన్ (19) మరియు అమీర్ ఖాన్ (26) లుగా గుర్తించారు. నిందితులందరూ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. ఫారినర్స్ యాక్ట్ మరియు పాస్‌పోర్ట్ రూల్స్ 1950 సెక్షన్ల కింద కొంగావ్ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది మరియు జ్యుడీషియల్ కస్టడీకి పంపబడింది.

    ప్రధాన నిందితుడు సలీం షేక్ గత 16 సంవత్సరాలుగా భివాండిలోని నాడి నాకా ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని భివాండి క్రైమ్ బ్రాంచ్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ హోన్మనే తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు వ్యక్తులను అక్రమంగా భారత్ కు తీసుకొచ్చాడు. అతను అనేక మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC) కంపెనీలలో పనిచేశాడు.. అలాగే పలువురిని చేర్చాడు. గత కొద్ది రోజుల్లో థానేలో బంగ్లాదేశ్ వలసదారులను అరెస్టు చేయడం ఇది రెండవ కేసు. కొన్ని రోజుల క్రితం మీరా భయందర్ వసాయి విరార్ పోలీసులు భయందర్‌లోని గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ జాతీయులను అరెస్టు చేశారు. దేశంలోని పలు ప్రాంతాలలో బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారు ఎవరికీ తెలియకుండా పనులు చేస్తూ ఉన్నారు. అక్రమంగా భారత్ లోకి చొరబడి.. ఇక్కడ కొందరు వారికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను ఇస్తూ ఉండడం జరుగుతూ ఉన్నాయి.

    Trending Stories

    Related Stories