భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేపటి యుద్దాలకు సన్నద్దం కావాలంటే మారాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్న తరుణంలో అజిత్ దోవల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మొత్తం గొప్ప మార్పునకు లోనవుతోంది. మనం స్పర్శ రహిత యుద్దాల వైపు వెళుతున్నామని తెలిపారు. అంతే కాకుండా అదృశ్య శత్రువుపై యుద్దం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జాతీయ మీడియా సంస్థతో అజిత్ దోవల్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కంటే ప్రస్తుతం సాంకేతికత అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అంతకంటే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తరుణంలో రేపటి కోసమైనా మనం సన్నద్ధం కావాలంటే మార్పులను అర్థం చేసుకోవాలి, వాటికి అనుగుణంగా నడుచు కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఒక రకంగా ఆయన అగ్నిపథ్ స్కీంను సమర్థించారు.భవిష్యత్తులో ఎదురయ్యే యుద్దాలు, వివాదాలకు దేశం సిద్దం కావాలంటే సాయుధ బలగాల అంలకరణలో మార్పు అవసరమన్నారు జాతీయ భద్రతా సలహాదారు. భద్రత అనేది ఒక డైనమిక్ కాన్సెప్ట్. ఇది స్థిరంగా ఉండదు. జాతీయ ప్రయోజనాలను, జాతీయ ఆస్తులను రక్షించు కోవాల్సిన పర్యావరణానికి సంబంధించి మాత్రమేనని పేర్కొన్నారు అజిత్ దోవల్.
ఇదిలా ఉండగా కేంద్ర సర్కార్ కొత్తగా కాంట్రాక్టు పద్దతిన సాయుధ దళాలలో అగ్నిపథ్ స్కీం తీసుకు వచ్చింది. మొదటి ఏడాది 30 వేలు, నాలుగో ఏడాది రూ. 40 వేలు ఇస్తారు. రూ. 48 లక్షల విలువ చేసే బీమా సదుపాయం ఉంటుంది. గ్రాట్యూటీ, పెన్షన్ ఉండదు.