ఢిల్లీలో అనుమానాస్పద బ్యాగ్ గుర్తింపు

0
871

ఢిల్లీలో మరోసారి ఓ బ్యాగ్ కారణంగా కలకలం మొదలైంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు నిర్వహిస్తుండగా.. సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంట్లోని బ్యాగ్‌లో పేలుడు పదార్థాలను గుర్తించారు. అందులో ఉన్నవి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)గా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) బృందం చేరుకుంది. వారు దానిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి నాశనం చేయనున్నారు.

గత నెలలో ఘాజీపూర్‌లో కనుగొనబడిన ఆర్‌డిఎక్స్‌ తో లింక్స్ ఉన్నాయనే కోణంలో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం సీమాపురిలోని ఇంటికి చేరుకుంది. సోదాలు చేయగా బ్యాగ్‌లో అనుమానాస్పద సీల్డ్ ప్యాక్ లభ్యమైంది. బ్యాగ్ దొరికిన గదిలో ముగ్గురు నుంచి నలుగురు అబ్బాయిలు అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. అనుమానాస్పద వస్తువుకు సంబంధించి కాల్ వచ్చిందని.. ప్రత్యేక సెల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

గత నెల ప్రారంభంలో ఢిల్లీ లోని త్రిలోక్‌పురి మెట్రో స్టేషన్‌లో రెండు అనుమానాస్పద బ్యాగులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో బాంబు భయం ప్రజలను వెంటాడింది. ఈ తర్వాత బ్యాగుల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. అదే రోజు సాయంత్రం నగరంలోని జామియా నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో బాంబు గురించి ఢిల్లీ పోలీసులకు ఓ “బూటకపు” కాల్ వచ్చింది.సీనియర్ పోలీసు అధికారి ఈ ఘటన గురించి వివరిస్తూ.. ఆ కారులో అనుమానాస్పద బాంబును ఉంచినట్లు కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. అక్కడ కారు పార్క్ చేసి, దాని బ్యాటరీని చుట్టి వాహనం లోపల ఉంచినట్లు గుర్తించారు.