మీ సలహాలు, సూచలను కోరుతున్న ప్రధాని మోదీ

0
798

భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగానికి ప్రజల నుండి సూచ‌న‌లు ఆహ్వానించారు. మీ ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు ఆగ‌స్టు 15న ప్ర‌ధాని ప్ర‌సంగంలో చోటుచేసుకొని ఎర్ర‌కోట ప్రాకారాల నుండి ప్ర‌తిధ్వ‌నిస్తాయని మోదీ ఈరోజు ట్విట్టర్ లో పోస్టు చేశారు. ప్ర‌ధాని ప్ర‌సంగం కోసం మీ ఇన్‌పుట్స్ ఏంటీ? వాటిని @mygovindia కు ట్వీట్ చేయాల్సిందిగా ప్ర‌ధాని కార్యాల‌యం శుక్ర‌వారం పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ప్రసంగంలో తన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తారని తెలిపారు. నాలుగేళ్ళ నుంచి నేరుగా ప్రజల ఆలోచనలు, సలహాలను కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ప్రజలు నవ భారతం కోసం తమ సలహాలను అందజేయాలని కోరారు. సలహాలకు అక్షర రూపం ఇచ్చి, తెలియజేయాలని కోరారు. ప్రజలు పంపించిన అంశాల్లో కొన్నిటిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తారని తెలిపారు.

ప్ర‌ధాని కార్యాల‌యం ఈ ట్వీట్ చేసిన సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ప్ర‌జ‌లు త‌మ ఆలోచ‌న‌ల‌ను పోస్టు చేయ‌డం ప్రారంభించారు. పాఠ‌శాల్లోని బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి టీకాలు వేయ‌డానికి ఒక మిష‌న్ ప్రోగ్రాంను ప్ర‌క‌టించాల‌ని.. జ‌నాభా పెరుగుద‌ల భార‌త్ అతిపెద్ద స‌మ‌స్య‌గా మారుతోందని.. ఈ విషయంపై కూడా మాట్లాడాలని పలువురు కోరారు. ఇంకొన్ని సూచలను ప్రధాని మోదీకి చెప్పుకొచ్చారు నెటిజన్లు..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here