వాఘా సరిహద్దుల్లో అల్లు అర్జున్

0
845

అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలసి వాఘా సరిహద్దు వద్ద సందడి చేశాడు. తన భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నాడు సరిహద్దులో భారత జవాన్లతో గడిపారు. అల్లు అర్జున్ వెంట ఆయన భార్య స్నేహారెడ్డి, కుమార్తె అర్హ, కుమారుడు అయాన్ ఉన్నారు. సాయంత్రం బీఎస్ఎఫ్ జవాన్లు చేసే కవాతులో అల్లు అర్జున్ గౌరవ అతిథిగా పాల్గొన్నాడు. సైనిక సిబ్బంది తో కలసి ఫొటోలు తీసుకున్నాడు. ఈ నెల 29న స్నేహారెడ్డి పుట్టిన రోజు. దీంతో తొలుత పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలసి సందర్శించాడు. ఆ తర్వాతా వాఘా సరిహద్దుకు వెళ్లారు.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్వర్ణ దేవాలయం క్యూ లైన్‌లో నిలబడి కనిపించారు. ఇద్దరూ తమ పిల్లలతో కలిసి గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. అర్జున్ గురుద్వారా సాహిబ్‌ని సందర్శించారు. ఇక తన సింప్లిసిటీతో పలువురు అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. సాధారణ భక్తుడిలా స్వర్ణ దేవాలయంలో అల్లు అర్జున్ క్యూ లైన్ లో నిలబడ్డాడు. అల్లు అర్జున్ ఇతర భక్తులతో కలిసి కదులుతున్నాడు. “తన భార్య స్నేహా రెడ్డి పుట్టినరోజును జరుపుకుంటున్న అల్లుఅర్జున్ గోల్డెన్ టెంపుల్ వద్ద ఇతరులతో కలిసి క్యూలో కనిపించారు” అనే శీర్షికతో మానవ్ మంగ్లానీ వీడియోను పోస్ట్ చేశారు.