More

    ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. కొత్త ఐఏఎస్‎లకు పోస్టింగులు!

    ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు కేటాయించింది. ఇదే సమయంలో కొందరిని బదిలీ చేసింది. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‎గా విజయసునీతను, గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్ డైరెక్టర్‎గా భావనను, శ్రీకాకుళం జేసీగా నవీన్‎ను, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణు చరణ్‎ను, మిడ్ డే మీల్స్ డైరెక్టర్‎గా నిధి మీనాను, ఏపీ సీఆర్డీయే అడిషనల్ కమిషనర్‎గా కట్టా సింహాచలంను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్‎శర్మ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే 2020 బ్యాచ్‎కు చెందిన యువ ఐఏఎస్‎లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‎లను కేటాయించారు.

    కొత్త సబ్ కలెక్టర్ల వివరాలు:
    తెనాలి – గీతాంజలి శర్మ
    రంపచోడవరం – శుభం బన్సాల్
    నరసాపురం – సూర్య తేజ
    టెక్కలి – రాహుల్ కుమార్ రెడ్డి
    పాలకొండ – నూర్ కౌమర్
    ఆదోని – అభిషేక్ కుమార్
    విజయవాడ – అదితి సింగ్
    పెనుకొండ – కార్తీక్
    గూడూరు – శోభిక
    కందుకూరు – మాధవన్
    పార్వతీపురం ఆర్డీవో – హేమలత.

    Trending Stories

    Related Stories