ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

0
619

ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ అధికారి చామకురి శ్రీధర్‎ సీసిఎల్ఏలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా, ఎన్.తేజ్ భరత్‎ను తూర్పు గోదావరి జిల్లా జేసీగా బదిలీ చేసింది. అపరాజిత సింగ్‎ను కృష్ణా జిల్లా జేసీగా, టి.నిశాంతిని నంద్యాల జిల్లా జేసిగా నియమించింది. మహేష్‎కుమార్‌ను పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్‎గా, ఎన్. మౌర్యను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.