ప్రస్తుతం కాలంలో సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొందరు ఈ మాధ్యమాల ద్వారా అవతలి వారిని వేధిస్తున్నారు.
మరికొందరు సైబర్ నేరగాళ్లు.. అమ్మాయిలుగా మాట్లాడుతూ.. హనీ ట్రాప్ చేస్తున్నారు. కొందరు బ్లాక్ మెయిలింగ్ కు దిగి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇంకొందరు అధికారులు.. ఈ ట్రాప్ లో చిక్కుకుని దేశ రహస్యాలను కూడా లీక్ చేసేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వెలుగులోనికి వచ్చింది.
ఢిల్లీకి చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి పాక్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్లో ఇరుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాశంగా మారంది. భారత దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి దేవేంద్ర శర్మ హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. భారత దేశానికి చెందిన ముఖ్యమైన రహస్యాలను సోషల్ మీడియా ద్వారా లీక్ చేసినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈయన ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి అరెస్టు చేశారు.
దేవేంద్ర శర్మ.. ఎయిర్ ఫోర్స్ కు చెందిన ముఖ్యమైన రహస్యాలను అవతలివారికి పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మే 6 న ఇతడిని అరెస్టు చేసినప్పటికి.. తాజాగా పోలీసులు అధికారికంగా అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నిందితుడు ఎన్ని రోజుల నుంచి విషయాలను లీక్ చేస్తున్నాడు.. ఇప్పటి వరకు ఏయే విషయాలను చెప్పాడో పలు విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితుడి ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ లను అధికారులు తమ స్వాధీనంలోనికి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.