More

    నేనొక ఫెయిల్యూర్‌ రాజకీయ నాయకుడిని: పవన్ కళ్యాణ్

    శనివారం హైదరాబాద్‌లో సీఏ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాజకీయాల్లో విఫలమయ్యానని చెప్పుకొచ్చారు. ‘తానొక ఫెయిల్యూర్‌ రాజకీయ నాయకుడినని.. దీన్ని తాను అంగీకరిస్తున్నాను’ అని చెప్పారు. అయితే తాను ప్రయత్నం చేశానని అనుకుంటానన్నారు. ఫెయిల్యూర్‌ కూడా సగం విజయంతో సమానమని భావిస్తున్నానని తెలిపారు. సినిమాల్లో హీరోగా నటించాలని తాను ఎప్పుడూ కోరుకోలేదన్నారు. తన మొదటి సినిమా ఫ్లాప్‌ అయిందని.. ఆ అపజయం తర్వాత కూడా తానెప్పుడూ నిరుత్సాహపడలేదన్నారు. తన విజయాల గ్రాఫ్‌ ఏడో సినిమా తర్వాత మాత్రమే పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆరేడేళ్లపాటు అపజయాలనే చవిచూశానన్నారు. ఆ తర్వాతే ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా విజయం దక్కిందని వెల్లడించారు. జీవితంలో అపజయాలు, విజయాలు సర్వసాధారణమన్నారు. విజయం కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తతతో ఉంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఏ విద్యార్థులకు సూచించారు.

    శిల్పాక‌ళా వేదిక‌లో జ‌రిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కండ‌క్ట్ చేసిన ఇంట‌ర్నేష‌న‌ల్ స‌ద‌స్సులో పాల్గొన్నారు. అక్క‌డ‌కు వ‌చ్చిన వారిని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తనని తాను ఫెయిల్డ్ పొలిటీషియన్ అని సంభోధించుకోవటంపై విద్యార్థులు ఒప్పుకోలేదు. చాలా మంది విద్యార్థులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. క్రిష్ జాగ‌ర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘హ‌రి హ‌ర వీర మ‌ల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ న‌టిస్తున్నారు.

    Trending Stories

    Related Stories