More

    పాక్ తీవ్రవాది బిలాల్ ను మట్టుబెట్టిన భారత సైన్యం

    సోమవారం నాడు శ్రీనగర్‌లోని హైదర్‌పోరా బైపాస్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరియు ఒక OGW (ఓవర్‌గ్రౌండ్ వర్కర్/టెర్రరిస్టుల సహాయకుడు) హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అల్తాఫ్ అహ్మద్ అనే వ్యక్తి గాయపడడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. హతమైన ఉగ్రవాదుల్లో పాక్ ఉగ్రవాది ఉన్నాడు. అతడిని బిలాల్ భాయ్‌గా గుర్తించారు. రెండో ఉగ్రవాది బనిహాల్‌కు చెందిన అమీర్ గా గుర్తించారు. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఓ ఇంటిలోకి వెళ్లి దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. మేము చుట్టుముట్టి వెతకడం ప్రారంభించాము. పై అంతస్తులో మూడు గదులు ఉన్నాయని.. అందులో భూయజమాని అల్తాఫ్‌, వ్యాపారి ముదాసిర్‌ గుల్‌లను బయటకు రావాల్సిందిగా కోరాం. ఇంతలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో ప్రజలను రక్షించడం పెద్ద సవాలుగా మారిందని పోలీసులు తెలిపారు.

    ముదాసిర్‌కు అల్తాఫ్‌ గదులు ఇచ్చారని, అనధికార కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారని ఐజీ తెలిపారు. అక్కడ నుంచి 9 కంప్యూటర్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా మ్యాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మేము కాల్ సెంటర్ నుండి అనేక దేశాల నంబర్‌లను గుర్తించామని తెలిపారు. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. ముదాసిర్ ఒక మాడ్యూల్ నడుపుతున్నాడని.. ఉగ్రవాదులను పలు ప్రాంతాలకు పంపుతున్నాడని గుర్తించారు. స్థానిక పౌరుల భద్రతపై భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి.

    Trending Stories

    Related Stories