హైద‌రాబాద్ మెట్రో ప్రయాణికుల‌కు గుడ్ న్యూస్

0
875

హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికులకు గుడ్ న్యూస్. మెట్రో స‌ర్వీసుల వేళ‌ల‌ను పొడిగించారు. ప్రస్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌లు అందుతున్నాయి. తాజాగా ఈ స‌మ‌యాన్ని రాత్రి 11 గంట‌ల‌కు పెంచాల‌ని హైద‌రాబాద్ మెట్రో రైల్ నిర్ణయించింది. పొడిగించిన కొత్త వేళ‌లు ఈ నెల 10 నుంచి అమ‌లులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉద‌యం 6 గంట‌ల‌కే మొద‌లవుతున్న మెట్రో రైల్ సేవ‌లు రాత్రి 10.15 గంట‌ల దాకా ప్రయాణికుల‌కు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా మెట్రో రైల్ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణయంతో రాత్రి 11 గంట‌ల దాకా మెట్రో సేవ‌లు అందనున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fourteen + eighteen =