పుట్టిన రోజున రోజు పార్టీ అనంతరం ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి.. ఇంటికి వచ్చిన స్నేహితుల్లో ఒకరు యువతిపై అత్యాచారానికి యత్నించిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని వడదోరకు చెందిన 28 ఏళ్ల యువతి హైదరాబాద్ లోని ప్రగతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 13న ఓ స్నేహితుడు తన పుట్టిన రోజు కావడంతో జూబ్లీ హిల్స్ లోని ఓ పబ్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి యువతిని కూడా ఆహ్వానించాడు. పార్టీ ఆలస్యంగా ముగియడంతో ప్లాట్ వద్ద యువతిని దింపేందుకు యువకులు వచ్చారు. తెల్లవారుజామున 5 గంటల వరకు అందరూ యువతి ప్లాట్‌లో కబుర్లు చెప్పుకున్నారు. యువతి తన గదిలో పడుకోగా..మిగిలిన వారు మరో గదిలో పడుకున్నారు. కొద్ది సమయం తరువాత రోషన్ తనపై అత్యాచార యత్నం చేస్తున్నట్లు గ్రహించిన యువతి అతన్ని పక్కకు నెట్టివేసేందుకు యత్నించింది. అతడు తనను కొట్టి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి 15వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం చిత్రపురి కాలనీకి చెందిన రోషన్‌ను అరెస్ట్ చేశారు.
బాచుపల్లికి చెందిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “ఉదయం 6.15 గంటలకు, ఆమె తన ప్రైవేట్ భాగాలలో తీవ్రమైన నొప్పితో ఒత్తిడికి లోనైంది. ఆమె నిద్ర నుండి ఉలిక్కిపడింది. లేవగా.. తనపై బలవంతం చేయడం చూసింది. మొండిగా ప్రతిఘటించినప్పటికీ, నిందితుడు బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు.” అని అన్నారు. దాడి తర్వాత బాధితురాలు సహాయం కోసం ఇతరులను పిలవడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఆమె స్నేహితుడిపై ఐపీసీ 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.