More

    భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యోగి ఆదిత్యనాథ్

    హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన యోగి ఆదిత్యనాథ్.. ఈ రోజు ఉదయం భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అమ్మవారికి హారతినిచ్చారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, పలువురు బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం రోజునే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి యోగి ఆదిత్యనాథ్ రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. ఆదివారం నాడు ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా సోమవారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చార్మినార్‌కు వచ్చే అవకాశం కూడా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

    భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద హైదరాబాద్ పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), టాస్క్ ఫోర్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, స్థానిక పోలీసు సిబ్బందిని మోహరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) సాయి చైతన్య, ఇతర పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

    spot_img

    Trending Stories

    Related Stories