More

    హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

    హైద‌రాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. న‌గ‌రంలోని రామంతాపూర్‌తో పాటు మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని తుక్కుగూడ‌లో అమిత్ షా ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రూట్ల‌లో వెళ్లే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

    శనివారం ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న తుక్కుగూడ గ్రామం వద్ద రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర సందర్భంగా రాచకొండ పోలీసులు ట్రాఫిక్ సూచనలను జారీ చేశారు. శ్రీశైలం జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా, ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, శ్రీశైలం రహదారిని నివారించాలని కోరారు. ఎల్‌బి నగర్, హయత్ నగర్ ప్రాంతాల నుండి విమానాశ్రయానికి చేరుకోవడానికి మందమల్లమ్మ, బాలాపూర్, వీడియోకాన్ జంక్షన్ మార్గాలను ఉపయోగించాలని అభ్యర్థించారు. రామంతాపూర్‌లో సెంట్ర‌ల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేట‌రీని అమిత్ షా ఇవాళ ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం సెమినార్ హాల్‌లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో హోంమంత్రి పాల్గొంటారు. ఆ స‌మావేశం ముగిసిన అనంత‌రం తుక్కుగూడ‌కు బ‌య‌ల్దేరుతారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుక్కుగూడ వైపు వ‌చ్చే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు అనుతించ‌బోమ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్, చాంద్రాయణ గుట్ట నుండి విమానాశ్రయానికి చేరుకోవడానికి ప్రయాణికులు ఆరంఘర్, శంషాబాద్ మార్గాన్ని ఉపయోగించాలని పోలీసులు కోరారు.

    Trending Stories

    Related Stories