Telugu States

హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేస్

గ్లోబల్ స్పోర్ట్ అయిన FIA ఫార్ములా Eకి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉంది. హైదరాబాద్ లో రేస్ కు FIA వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ ఆమోదించింది. ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్ ఈ-ప్రిక్స్ నిర్వహించనున్నారు. ఫార్ములా- ఈ మొదటిసారిగా భారతదేశంలో నిర్వహించనున్నారు. ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌ క్రీడల సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. దేశంలో జరిగే మొదటి ‘ఈ-రేస్’ కు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోగే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కానుంది. ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డు మీదుగా పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభత్వం ఏర్పాట్లు చేయనుంది. విద్యుత్ కార్లతో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జనవరిలో ‘ఫార్ములా ఈ’ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్ములా1 లాగా ‘ఈ–రేస్‌’కు ప్రత్యేక ట్రాక్‌ అవసరం ఉండదు. సాధారణ రోడ్లపైనే బ్యాటరీ కార్లతో రేసింగ్‌ నిర్వహించనున్నారు. భారత్ నుంచి మహింద్రా కంపెనీకి చెందిన ‘మహింద్ర రేసింగ్‌’ జట్టు పోటీ పడుతోంది. 2.37కిమీ ట్రాక్‌ను డ్రైవెన్ ఇంటర్నేషనల్ రూపొందించింది. ఈ ట్రాక్ హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన లుంబినీ పార్క్ గుండా వెళుతుంది.

Related Articles

Back to top button