హైదరాబాద్ టీనేజర్.. కేజీఎఫ్ రాకీ భాయ్ చేసిన పనే చేసి ఆసుపత్రి పాలు

0
733

కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలు తెలుగులో మంచి హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! KGF సిరీస్ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. రాకీ భాయ్ క్యారెక్టర్ చేసిన యశ్ యాటిట్యూడ్ ను యువకులు అనుకరిస్తూ ఉంటారు.

రాకీ భాయ్ సిగరెట్ తాగే సీన్ సినిమాలో హైలెట్. పలు సీన్స్ లో ఆ సిగరెట్ తాగుతూనే ఉంటారు. అలా ఒక టీనేజర్ రాకీ భాయ్ లాగా తాగాలని ప్రయత్నించి ఆసుపత్రి పాలయ్యాడు. KGF చాప్టర్ 2 రెండు రోజుల్లో మూడు సార్లు చూసిన హైదరాబాద్‌ కు చెందిన 15 ఏళ్ల బాలుడు రాకీ భాయ్ స్టైల్ లో సిగరెట్ తాగాలని.. ఒకటేసారి ఫుల్ ప్యాక్ సిగరెట్లు తాగాడు. దీంతో అతనికి తీవ్రమైన గొంతునొప్పి, దగ్గు రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని సెంచరీ ఆసుపత్రిలో బాలుడికి శనివారం చికిత్స అందించారు. చికిత్సతో పాటు వైద్యులు కౌన్సిలింగ్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

టీనేజర్లు హీరోలను చూసి సులభంగా ప్రభావితమవుతారు.. ఈ పిల్లాడు కూడా ధూమపానానికి అలవాటు పడ్డాడని వైద్యులు తెలిపారు. సిగరెట్ ప్యాకెట్‌ని తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మన సమాజంలో సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం.. ఇలాంటివి సినిమా సీన్లలో చూపాలా వద్దా అనే నైతిక బాధ్యత చిత్ర బృందాలకు ఉంటుంది.. ఇక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏమి చేస్తున్నారో తెలుసుకుంటూ ఉంది.