Sports

కోహ్లీ కుమార్తెని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాద్ టెకీ అరెస్ట్

టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత భారత క్రికెటర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా విమర్శించారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె పై కూడా అత్యంత దారుణమైన కామెంట్లు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో ప్రొఫైల్స్, ఐపీ అడ్రెస్ ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు.

కోహ్లీ కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన కేసులో హైదరాబాదుకు చెందిన వ్యక్తి అరెస్ట్‌ అయ్యాడు. టీ-20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఓటమి తరువాత కోహ్లీ కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అలిబత్తిని రాంనాగేశ్‌ గా గుర్తించారు. 23 ఏళ్ల రాంనాగేశ్‌ను ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి తరలించి విచారణ జరుపుతున్నారు. మహ్మద్‌ సమీకి సపోర్ట్‌ ఇచ్చిన్నందుకు కోహ్లీని బెదిరించాడు రాంనాగేశ్‌. పాక్ మ్యాచ్ అనంతరం విరాట్ భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికపై అత్యాచారానికి పాల్పడతామంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమీషన్. వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఎఫ్‌ఐఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన రాంనాగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నుంచి అతన్ని ముంబైకి తరలించి, విచారణ జరుపుతున్నారు. గతంలో ధోని కుమార్తె జీవాను కూడా రేప్ చేస్తామని బెదిరింపులకు దిగారు. భారత్ మ్యాచ్ లు ఓడిపోతే కొందరు ఎంతో దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులపై అత్యంత జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Back to top button