‘అల్లా హు అక్బర్’ అనలేదని చితకబాదారు..! హైదరాబాద్ మరో ఉదయ్‎పూర్ కానుందా..? కేసీఆర్, ఒవైసీ.. మీరెక్కడ..?

0
780

హైదరాబాద్‎లో ICFAI బిజినెస్ స్కూల్‎లో దారుణం జరిగింది. ‘న్యూస్ 18’ వార్తా కథనం ప్రకారం దాదాపు 15 నుంచి 20 మంది విద్యార్థులు హిమాంక్ బన్సల్ ను ‘అల్లా హు అక్బర్’ అని నినదించేలా ఒత్తిడి చేశారని అలా అనలేనందుకు అతడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని తెలిపింది. హిమాంక్ బన్సల్ దైవదూషణ చేశాడనే వదంతులతో వీరంతా ఉన్మాదంతో వ్యవహరించారు. పొత్తికడుపుపైనా, మర్మాంగాలపైనా తన్నుతూ అతడిని చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణాన్ని వీడియో తీస్తూ రాక్షసానందం పొందారు. ఆ వీడియోలో ఓ విద్యార్థి హిమాంక్‎ను కోమాలోకి వెళ్ళే వరకు కొడదాం అని చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో పాటు తనకు కొన్ని రసాయన పదార్థాలు కూడా తినిపించడానికి ప్రయత్నించినట్టు హిమాన్ష్ తెలిపాడు.

హిమాంక్ బన్సల్ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వివాదం రాజకీయ రంగును పులుముకుంది. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నాయకురాలు రచనా రెడ్డి,.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకు‎పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇటువంటి ఘటనలు జరిగితే తెలంగాణ సీఎంకు చీమ కుట్టినట్లు కూడా లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‎లో మతోన్మాదం బాగా పెరిగిపోతున్నా కూడా,.. సెక్యులరిజం ముసుగులో కేసీఆర్ దీన్ని కావాలనే విస్మరిస్తున్నాడని రచనా రెడ్డి విమర్శించారు. ఇటువంటి ఘటనలను విస్మరిస్తే రాబోయే కాలంలో మరిన్ని దాడులు జరిగే అవకాశముందన్నారు. ఇక దీనిపై విశ్వహిందూ పరిషత్ కూడా స్పందించింది. దీన్ని విద్యార్థుల మధ్య గొడవగా తాము భావించడంలేదనీ,.. ఇది పూర్తిగా హిందూ ముస్లింల గొడవగానే భావిస్తున్నామని తెలిపింది.

అయితే హైదరాబాద్‎లో జరిగిన ఈ ఘటనపై కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించకపోవడం వివాదాలకు దారితీస్తోంది. బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా చేసే ఆలోచనలో ఉన్న కేసీఆర్ తన రాష్ట్రంలో జరిగే ఏ విధమైన సంఘటనపైనైనా స్పందించాల్సి ఉంటుంది. అప్పుడే దేశ వ్యాప్తంగా జరిగే ఘటనలపై స్పందించే నైతికత కేసీఆర్ కి వస్తుంది. కానీ ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూడా ఇప్పటివరకు కేసీఆర్ కానీ, ట్విట్టర్ మంత్రి కేటీఆర్ నుంచి కానీ ఎటువంటి స్పందనా రాలేదు. ఇక వీరితో పాటు అటు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ఘటనపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తన సొంత నియోజకవర్గంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకున్నా ఇప్పటివరకు ఏ స్పందనా లేకుండా చోద్యం చూస్తుండటంతో ఎంఐఎం పార్టీపైనా విమర్శలు వస్తున్నాయి. స్వంత నియోజకవర్గంలో జరిగే ఘటనలపై స్పందించలేని నాయకుడికి దేశంలో జరిగే ఘటలపై స్పందించే నైతికత ఎక్కడిదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే ఘటన ఏ మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారిపైనో జరిగితే దేశవ్యాప్త చర్చ లేవనెత్తే అసదుద్దీన్ ఒవైసీ, ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర దుమారం రేగడంతో కాలేజీ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా చర్యలకు దిగారు. ఈ ఘటనలో పాల్గొన్న 12 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. వీరిలో ప్రధాన పాత్ర పోషించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై 307, 342, 450, 323, 506 సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. శంకర్ పల్లి పీఎస్ పరిదిలో ఘటన జరిగినందుకుగానూ ఆ పోలీస్ స్టేషన్‎లోనే కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తమ ట్విట్టర్‎లో వెల్లడించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

nineteen − eighteen =