More

    యూకే నుండి హైదరాబాద్ కు వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్.. మాస్కు ధ‌రించ‌క‌పోతే 1000 జ‌రిమానా

    యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 సంవత్సరాల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు 1000 రూపాయలు జ‌రిమానా విధిస్తార‌ని తేల్చిచెప్పారు. మాస్కు ధ‌రించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ క‌ట్ట‌డిపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా చ‌ర్చించామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలని అన్నారు.

    తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్ విషయమై అలర్ట్ అయింది. ఇప్పటికే ట్యాంక్ బండ్, చార్మినార్ ల వద్ద నిర్వహించే ఫన్ డే ను రద్దు చేసింది. సినిమా థియేటర్లు, మాల్స్, పబ్స్, మార్కెట్లు తదితర ప్రదేశాల్లో కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తోంది. స్కూళ్లు, కాలేజీలలో పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

    మరో వైపు భారతదేశంలో రెండు కేసులను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు కేసులను కర్ణాటకలోనే గుర్తించినట్టు తెలిపారు . 44 ఏళ్లు, 66 ఏళ్ల ఇద్దరు వ్యక్తుల్లో ఈ వేరియంట్ ను గుర్తించనట్టు తెలిపింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయినట్లు జీనోమ్ స్వీక్వెనింగ్ పరీక్షలో తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో వీరిద్దరిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన చెప్పారు.

    Trending Stories

    Related Stories