హైదరాబాద్ పబ్బుల్లో క్యాబరే డ్యాన్సులు.. మళ్లీ మొదలయ్యాయా..?

0
930

హైదరాబాద్ పబ్బులకు సంబంధించి ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా క్యాబరే డ్యాన్సులకు సంబంధించిన లీకులు పోలీసులకు అందాయి. శనివారం రాత్రి సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టకీలా పబ్ లో క్యాబరే డ్యాన్సులు కనిపించాయి. పబ్ లో మద్యం మత్తులో తూగుతున్న మందుబాబులను హుషారు పరిచేందుకు పబ్ యాజమాన్యం యువతులతో క్యాబరే డ్యాన్సులు ఏర్పాటు చేసింది. అర్థరాత్రి దాటినా పబ్ ను కొనసాగించింది. పబ్ నిర్వహణపై సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టకీలా పబ్ పై శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప‌బ్‌ను నిర్వ‌హిస్తున్నార‌ని నిర్థారించాక సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి 18 మందిని అరెస్ట్ చేశారు.