హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

0
985

బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు, చివరి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.

సద్దుల బతుకమ్మ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్‌బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తుండటంతో ఈ రూట్లలో 3 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

బతుకమ్మ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ట్యాంక్ బండ్ పై ఇందుకోసం భారీ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. వేల సంఖ్యలో మహిళలు వచ్చి ఈరోజు సద్దుల బతుకమ్మ ఆడుతుండటంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.