More

    ఉప్పల్ లో మ్యాచ్.. క్రికెట్ అభిమానులను వెంటాడుతున్న భయాలు

    హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నెల 18న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే జరుగుతోంది. వన్డే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు. ఈ నెల 13 నుంచి ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. పేటీఎంలో మాత్రమే టికెట్లను విక్రయిస్తామని తెలిపారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్లను తీసుకోవాలని చెప్పారు. జనవరి 14న న్యూజిలాండ్ జట్టు, 16వ తేదీన భారత జట్టు హైదరాబాద్ కు వస్తాయని తెలిపారు. న్యూజిలాండ్ జట్టు 15వ తేదీన ప్రాక్టీస్ చేస్తుందని, 17న ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటాయని చెప్పారు.

    గతేడాది భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగినప్పుడు ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జింఖానా మైదానం లో టిక్కెట్ల విక్రయం అంటూ తెలియడంతో టికెట్ల కోసం వచ్చిన వారు తొక్కిసలాటలో గాయాలపాలయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సరిగా ప్రణాళికతో ముందుకు వెళ్లి ఉంటే ఇలాంటిది జరిగేదే కాదని చెప్పుకొచ్చారు. పోలీసులు హెచ్సీఏ పై కేసు నమోదు చేశారు. టికెట్లను బ్లాక్ మార్కెట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించటం, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో అభిమానులకు సౌకర్యాలు కల్పించలేకపోవడం వంటి ఆరోపణలతో హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తోపాటు హెచ్సీఏ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ నెల 18న జరగబోయే వన్డే మ్యాచ్ విషయంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయో.. సజావుగా నిర్వహిస్తారో లేదో అనే భయం క్రికెట్ అభిమానులను వెంటాడుతూ ఉంది.

    Trending Stories

    Related Stories