More

    హైదరాబాద్ లో నిలిచిపోయిన మెట్రో సేవలు

    హైదరాబాద్ లో మెట్రో సేవలు షాకిచ్చాయి. సాంకేతిక లోపంతో మెట్రో రైలు సేవలు 45 నిమిషాలకు పైగా నిలిచిపోవడంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీలైనంత త్వరగా సర్వీసులను పునరుద్ధరించడానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్ నగరంలో నడుస్తున్న అన్ని మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. మెట్రో సర్వీసులను నమ్ముకున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మెట్రో అధికారులు.. సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

    వాట్సాప్ లో మెట్రో టికెట్స్:

    హైదరాబాద్‌ మెట్రో, ఎల్‌అండ్‌టీ సంస్థలు తొలిసారిగా ఈ-టికెటింగ్‌ను ప్రారంభించాయి. అధికారులు మెట్రోస్టేషన్లలో వాట్సాప్‌ టికెటింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు ప్రవేశద్వారం వద్ద క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్‌ చేసి యూపీఏ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. రైలు దిగిన తర్వాత వాట్సాప్‌లో వచ్చిన టికెట్‌ను స్కాన్‌ చేస్తే గేటు తెరుచుకుంటుంది. ఎల్‌అండ్‌టీ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటిసారిగా వాట్సప్‌ టికెటింగ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

    Trending Stories

    Related Stories