సాధారణంగా ఒక 5 నుండి 6 ఛలానాలు ఉంటే చాలు బండిని పక్కకు పెట్టి.. ఫైన్లు కట్టమని అడుగుతూ ఉంటారు పోలీసులు. అలాంటిది అతడి బండిపై 100కు పైగా ఛలానాలు పెండింగ్ లో ఉన్నాయి. అయినా కూడా పోలీసులు అసలు పట్టించుకోలేదు. సెంచరీ దాటేసినా కూడా హ్యాపీగా హైదరాబాద్ గల్లీలలో అతడు బండిపై రయ్యి రయ్యిమంటూ వెళ్లిపోతూ ఉన్నాడు. కానీ ఎట్టకేలకు పోలీసులు అతడి బండిని.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. తీరా పెండింగ్ ఛలానాల గురించి పోలీసులు లిస్టును బయటకు తీయగా.. ఏకంగా 117 బయటకు వచ్చాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా అవాక్కయేలా అతడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడు.

హైదరాబాద్ లోని నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. మహ్మద్ ఫరీద్ ఖాన్ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్ గల హోండా యాక్టివాపై ఉన్న చలాన్లు చూసి పోలీసులే షాక్ అయ్యారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈక్రమంలో పరీద్.. వాహనాన్ని ఆపి చెక్ చేయగా 117 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. రూ.30వేల రూపాయలు అతడు ఫైన్స్ చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో అతడి వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. మహ్మద్ ఫరీద్ ఖాన్ హైదరాబాద్ కలెక్టరేట్ మీదుగా వెళుతుండగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు చెల్లించిన తర్వాత తన బైక్‌ను తీసుకోవాలని ఫరీద్‌ఖాన్‌ను అడిగాడు. అలాగే నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘించేవారి కోసం పోలీసులు నిబంధనలను కఠినతరం చేశారని, అంటే 10 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారిని కౌన్సెలింగ్‌కు రావాలని కోరే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆ తర్వాత పరిణామాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
