More

    జిఐఎస్‎ని సందర్శించిన ఆర్మీ అధికారుల బృందం

    హైదరాబాద్‎: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణా సంస్థను పూణేలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆర్మీ అధికారులు సందర్శించారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సి.హెచ్.వెంకటేశ్వరరావు నేతృత్వంలో 106మంది ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణా సంస్థలో లెక్చర్, ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు. డిఫెన్స్ సర్వీసెస్ టెక్నికల్ స్టాఫ్ కోర్స్ కింద ఇండస్ట్రియల్ అండ్ డెమాన్స్ట్రేషన్ టూర్‎లో భాగంగా ఈ బృందం శిక్షణా సంస్థని సందర్శించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సామర్థ్య నిర్మాణ కార్యకలాపాలపై ఆర్మీ అధికారుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణా సంస్థ కార్యకలాపాలపై సి.హెచ్.వెంకటేశ్వరరావు క్లుప్తంగా వివరించారు. CGMT డివిజన్ సీనియర్ జియాలజిస్ట్స్ అమృత్ చంద్రపాత్ర, అన్నీ డాలియా జిఐఎస్, రిమోట్ సెన్సింగ్ రక్షణ ప్రయోజనం కోసం దాని విస్తృత ప్రయోజనంపై వివరించారు. ఆర్మీ అధికారులు శిక్షణా సంస్థ మ్యూజియం, రాక్ గార్డెన్లను కూడా సందర్శించారు. జియో-సైన్సెస్ రంగంలో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమాన్ని డైరెక్టర్ S.P. భూటియా సమన్వయం చేశారు.

    Trending Stories

    Related Stories