More

  హైదరాబాద్ లో డెలివరీ బాయ్స్ ను ఆపేసిన పోలీసులు

  హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో బాయ్స్ వాహనాలను పోలీసులు సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ సమయంలో కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ హైదరాబాద్ మొత్తం తిరుగుతూ వినియోగదారులకు కావాల్సినవి అందిస్తూ ఉంటారు. ఎల్బీ నగర్, ఖైరతాబాద్, ప్యాట్నీ చౌరాస్తా పలు ప్రాంతాల్లో డెలివరీ బాయ్స్ వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన బాయ్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. వారి బైకులను స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించారంటూ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించారు.
  ఫుడ్ డెలివరీ కోసం వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నారని.. డెలివరీ ఆపేయాలని తమ సంస్థల నుంచి సమాచారం లేదని పోలీసులకు చెప్పుకున్నారు. ముందుగా సమాచారం ఇస్తే తాము రోడ్ల మీదకు వచ్చే వాళ్ళమే కాదని… అనవసరంగా తమను ఇబ్బందుల పాల్జేస్తున్నారని.. తిండి-నీళ్లు కూడా లేవని వాపోయారు కొందరు. రెండు మూడు గంటల నుంచి రోడ్లపైనే ఉన్నామని డెలివరీ బాయ్స్ అంటున్నారు.

  లాక్‌డౌన్‌ వేళ ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాలని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కొంద‌రు రోడ్ల‌పైకి రావ‌డంతోనే క‌రోనా వ్యాప్తి చెందుతోందని.. ఏ అవ‌స‌రం ఉన్నా ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల మ‌ధ్య‌నే బ‌య‌ట‌కు రావాలని కోరారు. ఈ నాలుగు గంట‌ల స‌మ‌యంలోనే ఈ-కామ‌ర్స్ సేవ‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని.. లాక్‌డౌన్ స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. వాహ‌నాల‌ను కూడా సీజ్ చేస్తామ‌న్నారు. సీజ్ చేసిన వాహ‌నాల‌ను లాక్‌డౌన్ త‌ర్వాతే అప్ప‌గిస్తామ‌ని చెప్పారు.

  ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు చెప్పినా ఈ రోజు హైద‌రాబాద్‌లోని రోడ్ల‌పై భారీగా ట్రాఫిక్ కనిపించింది. అనుమతి లేకుండా బయటకు వచ్చిన ప‌లు వాహనాలను సీజ్ చేశారు. రోడ్ల‌పైకి వచ్చిన వాహనాలను త‌నిఖీ చేయడానికి పోలీసులు పూనుకోగా.. ఒక‌దాని వెనుక ఒక‌టి భారీగా నిలిచిపోయాయి. ఎర్ర‌గ‌డ్డలో పోలీసులు ముమ్మ‌రంగా త‌నిఖీలు చేస్తుండ‌డంతో రైతు బ‌జార్ నుంచి మూసాపేట వంతెన వ‌ర‌కు వాహ‌నాలు నిలిచిపోయాయి. దిల్ సుఖ్ నగర్, బేగంపేట, గోషామహల్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీగా నిలిచిపోయాయి.

  spot_img

  Trending Stories

  Related Stories