గణితశాస్త్రంలో 161 సంవత్సరాలుగా చిక్కుముడిగానే మిగిలిన ఓ సిద్ధాంతాన్ని హైదరాబాద్ కు చెందిన ఓ గణిత శాస్త్రవేత్త పరిష్కరించారు. ‘రీమన్ దత్తాంశం (రీమన్ హైపోథీసిస్)’ సిద్ధాంతాన్ని పరిష్కరించి హైదరాబాదీ ప్రొఫెసర్ సరికొత్త చరిత్రను సృష్టించారు. హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్న కుమార్ ఈశ్వరన్ ఈ ఘనతను సాధించారు.
గణిత, భౌతిక శాస్త్రవేత్తగా ఉన్న కుమార్ ఈశ్వరన్ తన పరిశోధనను ఐదేళ్ల క్రితమే పంపారు. తర్వాత దీన్ని రుజువు చేసేందుకు 2020 లో 8 మంది గణిత శాస్త్రవేత్తలు, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. వారు పరిశీలించి ఈశ్వరన్ RH యొక్క రుజువు సరైనదేనని తేల్చింది. ఈశ్వరన్ విశ్లేషణ సమగ్రమైనదని.. నిస్సందేహంగా ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ప్రతీది చాలా వివరంగా చూపించారని తెలిపింది. దీన్ని సాల్వ్ చేసినందుకు ఆయనకు ఏకంగా మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని ఇవ్వనున్నారు. అంటే మన కరెన్సీలో రూ.7.42 కోట్లు అన్నమాట. గొప్ప భారతీయ గణిత శాస్త్రవేత్తల జాబితాలో కుమార్ ఈశ్వరన్ కూడా చేరనున్నారని పలువురు ప్రశంసించారు.
జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గెస్ ఒక పరిశోధన వ్యాసంలో ఒక సంఖ్యకు దిగువన దాదాపుగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో గణించే సూత్రాన్ని రాశారు. అది శాస్త్రపరీక్షలో నిలబడలేదు. మరో ప్రఖ్యాత జర్మనీ గణితశాస్త్రవేత్త జార్జ్ ఫ్రెడ్రిచ్ బెర్న్‌హార్డ్ రీమన్ (1826-1866) ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి ‘జెటా ఫంక్షన్’ సాయంతో ప్రధాన సంఖ్యల సంఖ్యను గుర్తించవచ్చని ప్రతిపాదించారు. ‘జెటా ఫంక్షన్ శూన్యస్థానాలు లేదా మూలాలన్నీ సంకీర్ణ లేదా జంట తలంలో x = 1/2 అనే రేఖ మీద గుమిగూడి ఉంటాయి’ అని రీమన్ ప్రతిపాదించారు. దీనినే రీమన్ దత్తాంశం (రీమన్ హైపోథీసిస్) అని పిలుస్తారు. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన ‘క్లే మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్’ అనే సంస్థ రీమన్ సిద్ధాంతాన్ని రుజువు చేసినవారికి మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.4 కోట్లు) బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. ఈ సిద్ధాంతాన్ని కుమార్ ఈశ్వరన్ రుజువు చేశారు. ఈ సంస్థ గతేడాది జనవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది గణిత నిపుణులు కుమార్ ఈశ్వరన్ సిద్ధాంతాన్ని సమీక్షించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 16న నిపుణుల కమిటీ సమావేశమై కుమార్ ఈశ్వరన్ ఆధారాలు రీమన్ దత్తాంశాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించింది.