More

    హైబ్రిడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ హతం

    షోపియాన్‌లో గ్రెనేడ్ పేలుడులో ఇద్దరు కూలీలను చంపిన హైబ్రిడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో హతమయ్యాడు. షోపియాన్‌లోని నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. షోపియాన్ ఎన్‌కౌంటర్ కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరిపిన ప్రదేశానికి చాలా దగ్గరగా ఉంది. ఇమ్రాన్‌ బషీర్‌ అనే హైబ్రిడ్‌ టెర్రరిస్టు వెల్లడించిన వివరాల ఆధారంగా షోపియాన్‌లోని నౌగామ్‌ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్‌ బషీర్‌ చనిపోయాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. కశ్మీరీ పండిట్‌ను చంపిన ప్రాంతానికి సమీపంలోనే ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం.

    “Based on disclosure of arrested hybrid terrorist and in continuous raids by police & security forces, another contact has been established between terrorists & Security Forces at Nowgam Shopian, in which hybrid terrorist namely Imran Bashir Ganaie killed by firing of another terrorist,” అంటూ కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు.

    కశ్మీర్‌లోని భద్రతా బలగాలు, గూఢచార సంస్థలకు చిక్కకుండా ఈ హైబ్రిడ్ టెర్రరిస్టులు తప్పించుకుంటూ ఉంటారు. వీరు ప్రజలలోనే ఉంటారు. అయితే పై నుండి ఆదేశాలు రాగానే.. తీవ్రవాద దాడులను నిర్వహించి, ఆపై సాధారణ జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ఇచ్చిన అసైన్‌మెంట్‌లను ఎప్పటికప్పుడు పూర్తీ చేస్తూనే.. సాధారణ జీవితాలను గడుపుతూ ఉంటారు. వారు సాధారణ ప్రజల మధ్య నివసిస్తున్నందున వారిని ట్రాక్ చేయడం.. గుర్తించడం భద్రతా ఏజెన్సీలకు కష్టంగా మారుతుంది.

    Trending Stories

    Related Stories