More

    ఈటల రాజేందర్ ఘన విజయం

    హుజురాబాద్ లో బైపోల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23,865 వేల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలో 8,11 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగించగా.. మిగతా అన్ని రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించారు ఈటల. ఈటలకు 1,06,213 ఓట్లు పోలయ్యాయి. 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్‌లో 1130 ఓట్ల లీడ్‌ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత 23, 865 ఓట్లు ఆధిక్యంతో ఈటల రాజేందర్‌ భారీ విజయాన్ని సాధించారు.

    హుజురాబాద్ లోని ఐదు మండలాల్లో దాదాపు ఈటల పై చేయి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలం వీణవంక మండలంలోనూ ఈటలనే ఆధిక్యం సాధించారు. సర్వేలు కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. ఈ విజయంతో వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల. మూడు ఉప ఎన్నికలు, నాలుగు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు.

    రౌండ్ల వారీగా హుజూరాబాద్‌ బైపోల్‌ ఫలితాలు

    ఓట్లు టీఆర్‌ఎస్‌ బీజేపీ కాంగ్రెస్‌
    రౌండ్‌-20 3795 5269 107
    రౌండ్‌-19 2869 5916 97
    రౌండ్‌-18 3735 5611 94
    రౌండ్‌-17 4187 5610 203
    రౌండ్‌-16 3977 5689 135
    రౌండ్‌-15 3358 5407 149
    రౌండ్‌-14 3700 4746 152
    రౌండ్‌-13 2971 4836 101
    రౌండ్‌-12 3632 4849 158
    రౌండ్‌-11 4326 3941 104
    రౌండ్‌-10 3709 4295 118
    రౌండ్- 9 3470 5305 174
    రౌండ్- 8 4248 4086 89
    రౌండ్- 7 3792 4038 94
    రౌండ్- 6 3639 4656 180
    రౌండ్- 5 4014 4358 132
    రౌండ్- 4 3882 4444 234
    రౌండ్- 3 3159 4064 107
    రౌండ్- 2 4659 4851 220
    రౌండ్- 1 4444 4610 114

    Trending Stories

    Related Stories