More

    కుమార్తె పుట్టిందని భార్యను చితక్కొట్టడమే కాకుండా.. తలాఖ్

    రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ట్రిపుల్ తలాఖ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి చేసుకున్న పాపానికి ప్రతిరోజూ తన భర్త తనను కొట్టేవాడని మహిళ ఆరోపించింది. చిన్న చిన్న విషయాలకే హింసించడం మొదలు పెట్టేవాడని. కూతురు పుట్టడంతో మరింత దారుణంగా తన భర్త ప్రవర్తించడం మొదలుపెట్టాడని సదరు ముస్లిం మహిళ బాధను వెళ్లగక్కింది. ఆమెపై అఘాయిత్యాలు పెరిగి.. పెరిగి చివరికి ఇప్పుడు ట్రిపుల్ తలాఖ్ చెప్పి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు ఆ భర్త. ఆమెకు ఏడాదిన్నర పాప కూడా ఉంది.

    బాధితురాలు తన భర్త వసీం అన్సారీపై కోట రూరల్ కన్వాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త కొడుకు కావాలని కోరుకున్నాడని.. కూతురు పుట్టడంతో తనను చాలా వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. నెల రోజుల క్రితమే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఆ సమయంలో పోలీసులు పట్టించుకోలేదు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఆ మహిళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తనకు, తన భర్తకు మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయని మహిళ పోలీసులకు తెలిపింది. బుధవారం కోపంతో భర్త ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మూడు సార్లు తలాఖ్ చెప్పి ఇంటి నుంచి గెంటేశారు. ఈ విషయంపై మహిళ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.

    Trending Stories

    Related Stories