More

    పెద్ద ఎత్తున యాపిల్ ఫోన్ల సీజ్.. ఎందుకంటే..?

    ఐఫోన్ లక్షలు పెట్టి కొంటూ ఉంటాం.. కానీ ఛార్జర్ కూడా ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది చాలా దారుణమని ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని దేశాల్లో ఏకంగా యాపిల్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్ లో అయితే ఏకంగా యాపిల్ ఫోన్స్ ను సీజ్ చేస్తున్నారు. ఐ ఫోన్లతో పాటు చార్జర్లు ఇవ్వకపోడాన్ని బ్రెజిల్ అధికారయంత్రాంగం తప్పుబడుతోంది. ఫోన్ తో పాటు ఎంతో ముఖ్యమైన ఉపకరణం ఇవ్వడం లేదంటూ రిటైల్ స్టోర్ల నుంచి పెద్ద ఎత్తున యాపిల్ ఐఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఫోన్ తో పాటు చార్జర్ ఇవ్వనందుకు యాపిల్ పై బ్రెజిల్ ప్రభుత్వం ఇప్పటికే ఫైన్లు వేసింది. తాజాగా బ్రెజిల్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని రిటైల్ స్టోర్లలో మరోమారు దాడులు నిర్వహించి యాపిల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

    Trending Stories

    Related Stories