ప్రపంచంతో చైనా ‘బొమ్మ’లాట..!

0
748

ప్రపంచానికి ఏదైనా మంచి చేద్దామన్న ఆలోచనలేని దేశమేదైనా వుందంటే.. అది చైనా మాత్రమే. దేశాలు ఏమైనా ఫరవాలేదు గానీ, తాను మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోవాలి. ఇప్పటికే కరోనా కాటుకు బలిచేసి పబ్బం గడుపుకుంటున్న డ్రాగన్.. ప్రపంచానికి ఊపిరి కూడా ఆడనివ్వకుండా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం అత్యధిక మొత్తంలో పెరగడానికి చైనాయే మూల కారణమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా తయారు చేస్తున్న రసాయన, ఔషధ పరిశ్రమల వల్ల సముద్ర జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయట, అంతేకాదు ప్రపంచ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయట. దాని వల్ల మానవ శరీరంపై ప్రత్యక్ష ప్రభావం పెరిగే అవకాశం వుందని.. వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూమి ఉష్ణోగ్రత పెరిగే కొద్ది వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే పర్యావరణం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ షన్నా స్వాన్ తాజాగా రాసిన కౌంట్ డౌన్ అనే పుస్తకంలో, కాలుష్యం కారణంగా మానవుల జననాంగాల పరిమాణం కూడా తగ్గుతోందని తేల్చారు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ జననేంద్రియాలు పనిచేయకపోయే ప్రమాదం కూడా వుందని హెచ్చరించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ రేణువుల్లోని థాలెట్ అనే మూలకం కారణంగా సంతానోత్పత్తి రేటులో సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉందని రాశారు. థాలేట్ అనేది ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనం, ఇది హార్మోన్ ఉత్పత్తి చేసే ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అందులో పేర్కొన్నారు. అలాగే కౌంట్ డౌన్ పుస్తకంలో మన ఆధునిక ప్రపంచం స్పెర్మ్ కౌంట్ ను, స్త్రీ, పురుష పునరుత్పత్తి అభివృద్ధిని మరియు మానవ జాతి యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని రానుకొచ్చారు.

తాజాగా తన పరిశోధనల్లో ఎలుకలలో థాలేట్ సిండ్రోమ్‌ను పరిశీలించినట్లు శాస్త్రవేత్త తన పరిశోధనలో తెలిపారు. థాలెట్ రసాయనం వల్ల గర్భస్థ శిశువుల్లో కుంచించుకుపోయిన జననేంద్రియాలతో పుట్టే అవకాశం ఉందని కనుగొనబడింది. థాలేట్ ప్లాస్టిక్‌ఇప్పుడు బొమ్మల ద్వారా, ఆహారంలోకి ప్రసారం అవుతోందని, తరువాత మానవ అభివృద్ధికి హాని కలిగిస్తుందని డాక్టర్ స్వాన్ అభిప్రాయపడ్డారు. థాలేట్ రసాయనం మానవ శరీరంలో హార్మోన్ల సహజ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. శిశువులలో జననేంద్రియాల అభివృద్ధిలో నిరోధానికి కారణమవుతుంది. థాలెట్ పై గతంలోనూ పలు పరిశోధనలు జరిగాయి. ఈ విషపూరిత రసాయనం వల్ల రానున్న రోజుల్లో మానవ జాతి ప్రమాదంలో పడనుందని నివేదికలు తేల్చిచెప్పాయి. ఇప్పటికైనా, చైనా వస్తువులకు దూరంగా వుంటేనే మనకు మనుగడ అని చెప్పికనే చెబుతున్నారు పర్యావరణ నిపుణులు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

5 × 1 =