గూగుల్ కు భారీ జరిమానా విధించిన ఆ దేశ ప్రభుత్వం

0
668

ప్రముఖ కంపెనీ గూగుల్ కు ఫ్రాన్స్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. వార్తల ప్రచురణ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోకుండా, వాటి కంటెంట్ ను నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటోందని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గూగుల్ కు చెందిన గూగుల్ న్యూస్ పేజ్ లో తమ కంటెంట్ ను అనుమతి లేకుండా వినియోగిస్తున్నారంటూ అనేక ఫ్రెంచ్ మీడియా సంస్థలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి.ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఫ్రాన్స్ ప్రభుత్వ అధీనంలోని యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ గూగుల్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించింది.

గతంలోనే గూగుల్ స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ ఆదేశించినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. దీంతో రెగ్యులేటరీ భారీ జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో గూగుల్ కు రూ.4,415 కోట్ల మేర జరిమానా విధించింది.

గూగుల్ తమ న్యూస్ కంటెంట్ ను వాడుకుంటూ వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగా ఆదాయం పొందుతోందని వార్తా సంస్థలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నాయి. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్‌ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్‌ యూరోలను ఫైన్‌ విధించింది. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే. తాజా పరిణామంపై గూగుల్ నుంచి ఇంకా స్పందన రాలేదు. కాపీరైటెడ్‌ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్‌ చెల్లించాలని, లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here