More

    హుబ్లీ హింసాకాండ.. ఎంఐఎం నేత అరెస్ట్..!

    కర్ణాటకలోని హుబ్లీలో నగరానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రార్థనా మందిరంపై కాషాయ జెండాను ఎగురవేస్తున్నట్టుగా ఉన్న ఎడిట్ చేసిన వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ వీడియో ఓ గంటలోనే వైరల్ అయింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాలంటూ కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గానికి చెందిన దాదాపు వెయ్యిమంది అర్ధరాత్రి వేళ హుబ్లీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వంసం చేశారు. దాడిలో ఓ ఆలయం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. సీఐ సహా 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. వివాదాస్పద వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వారిలో 45 మందిని అరెస్ట్ చేశారు.

    శనివారం నాడు జరిగిన హుబ్లీ హింసాకాండకు సంబంధించి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు అరెస్టయ్యాడు. హుబ్లీ హింసాకాండకు సంబంధించి ఏఐఎంఐఎం కార్పొరేటర్ హుస్సేన్బీ నల్వత్వాడ్ భర్త ఇర్ఫాన్ నల్వత్వాడ్‌ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. 77వ వార్డుకు చెందిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ హుస్సేన్బీ నల్వత్వాడ్ భర్త ఇర్ఫాన్ నల్వత్వాడ్‌ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో ఈ అరెస్టు జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసు అధికారులు గాయపడగా, వారిలో ఒకరు ఇన్‌స్పెక్టర్‌ కూడా ఉన్నారు.

    ఘర్షణల నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. “నగరమంతటా 144 సెక్షన్ అమలు చేయబడింది, పరిస్థితి అదుపులోకి వచ్చింది” అని పోలీసు కమిషనర్ లాభూరామ్ ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌తోపాటు పలువురు మంత్రులు నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

    Trending Stories

    Related Stories