కుప్పం రైల్వే స్టేషన్ లో హౌరా ఎక్స్ ప్రెస్ లో మంటలు వ్యాపించాయి. దీంతో స్టేషన్ లోనే రైలును నిలిపేశారు. మంటలు వ్యాపించాయని తెలియడంతో ప్రయాణికులు భయపడి రైలు నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. బెంగళూరు నుంచి కుప్పం మీదగా యశ్వంత్పూర్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ లో మంటల కలకలం మొదలైంది. ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఎస్9 బోగీలో మంటలు వ్యాపించడంతో కుప్పం రైల్వేస్టేషన్లో రైలు నిలిచిపోయింది. రైలు దిగిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రైల్వే సిబ్బంది.. వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారులు విచారణ చేపట్టారు.