కరోనా కట్టడిలో భారత దళాలు పోషించిన పాత్ర మీకు తెలుసా?

0
782

కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొవడంలో పీఎం మోదీ విఫలమయ్యారని విపక్షాలు అదే పనిగా విషప్రచారం చేస్తున్నాయి. దేశీయా మీడియా చానెళ్లుతోపాటు., అంతర్జాతీయ మీడియా, పత్రికలు, వెబ్ పోర్టల్ల ఎడిటర్లు అంతా కూడబలుక్కున్నట్లుగా, ఒకరి తర్వాత ఒకరు అదేపనిగా, ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించడం మనం చూస్తున్నాం. శ్మశాన పాత్రికేయంతో మొదలు పెడితే, కొవిడ్ కేసుల సంఖ్యలను, మరణాల సంఖ్యలపై తప్పుడు కథనాలు ప్రచారంలోకి తెచ్చారు. ఆయా దేశాల జన సంఖ్యను దాచిపెట్టి శాతాల్లో మాత్రమే చూపేడుతూ.., దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కోవిడ్ కు సంబంధించి చాలా వరకు అసత్యాలను, అభూతకల్పనలను అదేపనిగా ప్రచారంలోకి తెచ్చారు.

పీఎం మోదీ సూపర్ స్ప్రెడర్, మోదీ స్ట్రెయిన్, రిజైన్ మోదీ.. అంటూ హ్యాష్ ట్యాగులు, కామెంట్లు చేశారు. నేషనల్ మీడియాతోపాటు,తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా చానళ్లు, పత్రికలు పెట్టిన హెడ్డింగులను చూస్తే.., పీఎం మోదీ మీద తమ కసిని తీర్చుకుంటున్నాయా? అని అనిపించకమానదు. ప్రధాని మోదీ పై ఇలాంటి విషప్రచారం కొత్తకాదు. ఇంటర్నేషనల్ మీడియా నుంచి  తెలుగు ప్రాంతీయ చానళ్ల వరకు మోదీ అంటే ఎందకంతా ద్వేషం.?

అయితే ప్రధాని మోదీ మాత్రం తనపై జరుగుతున్న ఈ విషప్రచారంపై ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. రాజకీయాలకు ఇది సమయం కాదన్నట్లుగా తన పని తాను చేసుకుని వెళ్తున్నారు.

ఈ కోవిడ్ కట్టడిలో పీఎం మోదీ.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలనే కాదు.., డీఆర్డీవో, ఇస్రో లాంటి సంస్థలను సైతం భాగస్వామిగా మార్చారు.  

కోవిడ్ కట్టడిలో మన దేశ రక్షణ దళాలు ఏ విధంగా పనిచేశాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!

ఏప్రిల్ పదో తేదీ నుంచి దేశంలో క్రమంగా కరోనా కేసులు సంఖ్య పెరగడం మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితులు ఒక్కసారిగా దిగజారిపోయాయి. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందని పరిస్థితి నెలకొంది.

దీంతో ప్రధాని మోదీ క్షణం ఆలస్యం చేయకుండా వైద్యపరమైన ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ప్రముఖులందరితో చర్చించారు. వైద్యుల నుంచి కూడా సలహాలు తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఆయన పరిశీలించారు.

నిజానికి మన దేశంలో వైద్యపరమైన ఆక్సిజన్ వినియోగం 700 మెట్రికల్ టన్నుల వరకు మాత్రమే ఉండేది. దీంతో ఈ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన ట్యాంకుల సంఖ్య కూడా మన దేశంలో పరిమితంగానే ఉండేది.!  అయితే కరోనా మొదటి దశ నుంచే దేశంలో ఆక్సిజన్ వినియోగం నాలుగు రెట్లు పెరిగింది. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేనాటికి రోజుకు 6వేల మెట్రికల్ టన్నులకుకు పైగా ఆక్సిజన్ అవసరం పెరిగింది. దీంతో పాటు  ఆక్సిజన్ సరఫరా కోసం క్రయోజెనిక్ ట్యాంకుల కొరత కూడా ఏర్పడింది. మొదట రిలయన్స్, టాటా, జిందాల్, వేదాంత వంటి ఇతర పారిశ్రామిక సంస్థలకు చెందిన క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ కొరతను అదిగమించేందుకు ప్రయత్నించారు పీఎం మోదీ.!

ఆసుపత్రుల్లో కరోనా బాధితుల ప్రాణాలను నిలిపేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లల్లో ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా నోడల్ అధికారులను గుర్తించారు. అలాగే మూసివేసిన ఫ్యాక్టరీల్లో సైతం ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చారు.

ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన ట్యాంకర్లను ఆయా ప్లాంట్ల వద్దకు చేర్చేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17 సరకు రవాణా విమానాలను వినియోగించారు. అలాగే ఆక్సిజన్ ను దేశంలోని అన్ని ప్రాంతాలకు శరవేగంగా తరలించేందుకు ప్రత్యేక గూడ్స్ రైళ్లను నడిపారు.

ఆక్సిజన్ తరలింపునకు క్రయోజెనిక్ ట్యాంకులు తక్కువ పడుతున్నాయని తెలియడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ17 విమానాలను జర్మనీ, సింగపూర్ లకు పంపించి.., 36 గంటల్లోనే అక్కడి నుంచి ఎయిర్ లిప్ట్ చేశారు.

వీటితోపాటు ఆక్సిజన్ కంటైనర్లు, ఇంకా అవసరమైన వైద్య పరికరాల రవాణా కోసం భారత నౌకదళాన్ని రంగంలోకి దించారు. భారత నావికా దళపతి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ తో  పీఎం మోదీ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ బాధితుల అవసరాల కోసం దేశంలోని అన్ని తీర ప్రాంతాల్లో ఉన్న నేవీ ఆసుపత్రులను తెరిపించారు. అలాగే సముద్రసేతు మిషన్ 2 పేరుతో 9 యుద్ధ నౌకలను సైతం రంగంలోకి దింపింది నేవీ.! బహ్రెయిన్, ఖతర్, కువైట్ , సింగపూర్ వంటి దేశాల నుంచి.. యుద్ధనౌకల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లు, అత్యవసర మందులను, ఇంకా అనేక వైద్యపరికరాలను భారత్ కు తీసుకుని రావడం జరిగింది.  

భారత వాయుసేన, నావిక దళం తోపాటు.. ఇండియన్ ఆర్మీని కూడా పీఎం మోదీ కరోనా సహాయ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేశారు. దీనిపై ఆయన ఆర్మీ చీఫ్ నరవణేతో కూడా సమీక్ష నిర్వహించారు. బాధితులకు వైద్యసాయం కోసం ఆర్మీ ఆసుపత్రులను తెరిచారు. మరికొన్ని చోట్ల యుద్ధ ప్రతిపాదికన తాత్కాలిక ఐసోలేషన్ సెంటర్లను సైనికులు నిర్మించారు. అలాగే విదేశాల నుంచి నౌకల ద్వారా భారత తీరం చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు, వైద్య పరికరాల సరఫరాకు సంబంధించిన విధుల్లో సైతం ఇండియన్ ఆర్మీ పాల్గొంది.  

ప్రాణపాయ స్థితిలో ఉన్న కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ కొరతను ఆధిగమించిన తర్వాత ప్రధాని మోదీ.., దేశంలోని అన్ని ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. వీటి ఏర్పాటులో డీఆర్డీవోతోపాటు ఇస్రోను సైతం భాగస్వామిని చేశారు.

భారత్ రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో అక్కడికక్కడే ఆక్సిజన్‌ తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించి.. దేశవ్యాప్తంగా 500 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు డీఆర్డీవో ముందుకు వచ్చింది. ఈ టెక్నాలజీ సాయంతో ఏర్పాటయ్యే కేంద్రాలు ఒక్కొక్కటీ నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక్కో కేంద్రంతో 190 మందికి ఆక్సిజన్‌ అందించవచ్చు. అలాగే అదనంగా 195 సిలిండర్లలో ఆక్సిజన్ ఫిల్ చేయవచ్చు.!

గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ లోనే ముందుకు వచ్చింది. సహజ సిద్ధమైన గాలిని ఒత్తిడికి గురి చేయడం ద్వారా నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్ , ఇతర వాయువులను వేరు చేసి ఈ ప్లాంట్లల్లో ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తారు. ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాల్లోని 162 ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో గాంధీ ఆసుపత్రితోపాటు ఖమ్మం, కరీంనగర్ ఆసుపత్రుల్లో వీటిని ఇప్పటికే ఏర్పాటు చేసి రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇతర ఆసుప్రతులకు సైతం ఆక్సిజన్ అవసరాలను ఈ ప్లాంట్లు తీరుస్తున్నాయి.

అలాగే మన దేశంలో ఆసుపత్రుల్లో ప్రధానంగా ఐసియూలోనే ఎక్కువగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన వ్యవస్థల ఏర్పాటు ఉంటుంది. మిగిలిన వార్డుల్లో సైతం నామమాత్రంగా ఏర్పాట్లు ఉంటాయి. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్న బాధితులకు అప్పటికప్పుడు ఆక్సిజన్ అవసరమైనప్పుడు వారు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు డీఆర్డీవో సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. నిజానికి దీనిని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్‌ అందించేందుకు  డీఆర్డీవో అభివృద్ధి చేయడం జరిగింది. దీనిలో మార్పులు చేసి…, ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం- SPO-2ను రూపొందించింది డీఆర్డీవో.

ఆక్సిజన్‌ సిలిండర్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్‌ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానుగానే  ఆక్సిజన్‌ సరఫరా మొదలుపెడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు ఎస్‌పీఓ2ను పరిశీలిస్తూ,  హెచ్చుతగ్గులకు  అనుగుణంగా ఆక్సిజన్‌ ను సరఫరా చేస్తుంటుంది. ఒక లీటర్‌ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది. కోవిడ్‌ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే కరోనా బాధితుడికి ఎంత మేరకు ఆక్సిజన్ అవసరమైతే, అంతవరకే వినియోగం జరగడంతో, ఆక్సిజన్ వృథాను సైతం అరికట్టవచ్చు.

ఈ కరోనా ఆపత్కాలంలో డీఆర్డీవో చేసిన మరో అద్భుతమైన ఆవిష్కరణ 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్‌ !  దీనిని 2-డీజీ డ్రగ్‌ గా పిలుస్తున్నారు. ఈ ఔషధాన్ని డీఆర్డీవో., డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ తో కలిసి సంయుక్తంగా రూపొందించింది. పౌడర్ రూపంలో ఉండే ఈ మందుతో కొవిడ్ ను అరికట్టడమే కాకుండా,  రోగుల ఆక్సిజన్ అవసరాన్ని సైతం తగ్గిస్తుంది. ఈ మందు ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాతే డీజీసీఐ అనుమతిని ఇచ్చింది.

అత్యంత ప్రమాదకరమైన ప్రతికూల వాతావరణాల్లో గస్తీకాసే దేశ సైనికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీఆర్డీవోకు చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం అనేక పరిశోధనలు చేస్తూ ఉంటుంది.  ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతాల్లో విధుల్లో ఉండే సైనికుల కోసం మొదట  2డీజీ మాలిక్యూల్‌పై ప్రయోగాలు చేసింది. ఆ తర్వాత ఈ మందు కరోనాపై కూడా పనిచేస్తుందని డీఆర్డీవో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందును ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చామని డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి చెప్పారు. దీనిని రెండు రోజుల క్రితమే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2-డీజీ డ్రగ్ భారత్ నే కాకుండా ప్రపంచాన్ని సైతం కాపాడబోతుందని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

డీఆర్డీవోతోపాటు ఇస్రో కూడా ఒక పోర్టబుల్ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను రూపొందించింది. దీనికి శ్వాస్ అని నామకరణం చేసింది. కోవిడ్ బాధితులతోపాటు, ఇతర శ్వాసకోశ సంబంధ అనారోగ్యాలతో బాధపడేవారికి, అలాగే ఆక్సిజన్ థెరపీ తీసుకునేవారికి ఈ పోర్టబుల్ కాన్సన్ ట్రేటర్ ఎంతగానో ఉపయోగపడనుంది. దీని ద్వారా ఏకకాలంలో ఇద్దరు కరోనా బాధితులకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందించవచ్చు. వీటిని దేశ వ్యాప్తంగా మార్కెట్ లో విడుదల చేసేందుకు మాన్యుఫక్చరింగ్ కంపెనీలకు ఆడర్లను సైతం ఇచ్చింది ఇస్రో.! ఇంకా తమిళనాడు.. తుత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ను ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తిరిగి తెరవడం జరిగింది.అయితే ఆక్సిజన్ ప్లాంట్ లోని కోల్డ్ బాక్స్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆక్సిజన్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇస్రో టెక్నికల్ టీమ్ మరమ్మత్తులు చేపట్టి ఆక్సిజన్ ఉత్పత్తి జరిగేలా చేసింది.

ఇండియన్ ఆర్మీ కూడా లిక్విడ్ ఆక్సిజన్ ను లోయర్ ప్రెషర్ ఆక్సిజన్ గ్యాస్ గా మార్చి నేరుగా కోవిడ్ బాధితులకు బెడ్స్ వరకు తీసుకెళ్లేలా ఓ పోర్టబుల్ పరికరాన్ని రూపొందించి ప్రయోగాత్మకంగా పరీక్షించింది.

భారత్ లో కోవిడ్ కట్టడి కోసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వరకు, డీఆర్డీవో,  ఇస్రో…, ఇలా అన్ని సంస్థలు తమవంతు సహకారాన్ని అందించిన విషయాన్ని మన దేశంలోని నేషనల్ మీడియా కానీ తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకున్నది లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోవాలి…ఈ కరోనా కల్లోల సమయంలో నరేంద్ర మోదీ కాకుండా మరోకరు ప్రధానిగా ఉండి ఉంటే… ఇంత విపత్కర సమయంలో ఇలా అన్ని సంస్థలు.., ఇంత పకడ్బందీగా పనిచేసి ఉండేనా…?

ఈ ప్రశ్నకు సమాధానం…మీరే నిర్ధారించుకోండి..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × 5 =