More

  ఆర్మీ అవసరం లేదన్నాడు.. దేశాన్ని ఆగం చేశాడు.. ఇవీ తొలి ప్రధాని ఘనకార్యాలు..!

  ‘రబ్బిష్ టోటల్ రబ్బిష్’ మనకు ఏ ఢిఫెన్స్ పాలసీ అవసరం లేదు. భారత్ శాంతియుత దేశం. భారత ఆర్మీని పూర్తిగా తొలగించండి. అప్పుడే మనం ఏ యుద్దాలు లేకుండా ప్రపంచదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పవచ్చు. ఈ మాటన్నది ఎవరో తెలుసా..? మీ ఊహకు కూడా అందని వ్యక్తి. అతడే భారత్ కు మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ. అవును సాక్ష్యాత్తూ భారత తొలి ప్రధానే.. మనకు ఎలాంటి రక్షణ వ్యవస్థ అవసరం లేదని చెప్పాడు. కేవలం మాటలకే పరిమితం కాలేదు. నెహ్రూ ప్రవేశపెట్టిన బడ్జెట్‎లో కూడా భారత రక్షణ వ్యవస్థకు నెమ్మది నెమ్మదిగా నిధులు తగ్గించుకుంటూ వచ్చాడు. అయితే దీని వెనకున్న కుట్ర ఏమిటి..? అసలు ఆర్మీ లేకుంటే ఏ దేశమైనా నిలబడగలదా..? ఆర్మీని పూర్తిగా నిర్మూలించకుండా నెహ్రూని ఆపిందెవరు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  సృష్టిలో ప్రతి జీవికీ రక్షణ అవసరమే. చీమ నుంచి పాము వరకూ రక్షణ లేకుండా ఏ జీవీ మనుగడ సాగించలేదు. ఏ జీవిపై ఎప్పుడు, ఎలా దాడి జరుగుతుందో తెలియదు. అందుకే చిన్న పక్షల నుంచి భారీ ఏనుగుల వరకు అనుక్షణం శతృవులపై ఓ కన్నేసి ఉంచుతాయి. ఏ మాత్రం ఆద మరచినా,.. మాటు వేసిన క్రూరమృగాలకు ఆహారం కాక తప్పదు. ఇదే సృష్టి నేర్పిన జీవిత సత్యం. అయితే, ఇది కేవలం నోరులేని మూగ జీవాలకు మాత్రమే కాదు. మెదడుతో బాగా ఆలోచించగలిగే మానవులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే మానవుడు బాగా తెలివిమీరినవాడు,.. అందుకే ఇతర జీవులను చంపుకుతినడమే కాకుండా సాటి మానవుడిపై కూడా మాటు వేసి దాడులు చేయగలడు. దాన్నే ఆధునిక సమాజంలో యుద్దం అన్నారు. రాతియుగం నుంచి రాజుల కాలం దాటి ఆధునిక కాలం వరకు యుద్దం లేని ప్రపంచం కానీ, రాజ్యాలు కానీ లేవు. గణాంకాలను పరిశీలిస్తే.. గడచిన 3,421 సంవత్సరాల్లో కేవలం 268 సంవత్సరాలు మాత్రమే యుద్దాలు లేకుండా గడిచాయి. అంటే యుద్దం అనివార్యమని ఇట్టే చెప్పేయవచ్చు. అందుకే చిన్న చిన్న దేశాల నుండి అగ్రదేశాల వరకు ప్రతి దేశం తన స్వీయ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంది. అయితే భారత దేశ మొట్ట మొదటి ప్రధానికి మాత్రం రక్షణ వ్యవస్థ అస్సలు అవసరం లేదనిపించింది. అందుకే భారత దేశానికి మొట్టమొదటి లెఫ్టినెంట్ కమాండర్.. డిఫెన్స్ పాలసీని తయారు చేసి నెహ్రూ ముందుంచితే.. తీవ్రంగా తిట్టి పంపారు.

  అసలు నాటి భారత ప్రధానికి డిఫెస్స్ మీద ఆసక్తి ఎందుకు లేదో తెలుసా..? స్వాతంత్య్రం ముందు నుంచీ కాంగ్రెస్ నాయకులకు శాంతి వచనాలు బాగా వంటబట్టాయి. ఒకవైపు భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి వారు యుద్దం వల్లే భారత్ కు స్వాతంత్ర్యం సిద్దిస్తుందని పోరాటాలు చేస్తుంటే,.. ఇటు కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇవేమీ కాకుండా కేవలం శాంతి వచనాలతోనే స్వాతంత్ర్యం సిద్దిస్తుందని నమ్మారు. ఎవరో నీరు పోస్తే మరెవరో కాయలు కోసుకున్నారన్నట్లు,.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వారు కొంతమందైతే మరొకరు భారతాన్ని ఏలారు. ఈ విధంగా ప్రధానమంత్రి అయిన నెహ్రూలో శాంతి భావాలు బాగా ఎక్కువయ్యాయి. దీంతో భారత్ కు అసలు రక్షణ వ్యవస్థే అవసరం లేదని నెహ్రూ నమ్మేవాడు. తాము గాంధీ బోధించిన శాంతి వచనాలకే కట్టుబడి ఉన్నామని నెహ్రూ భావించేవాడు. అంతేకాదు,.. తాము శాంతి సంయమనంతో ఉంటే తమవద్ద రక్షణ వ్యవస్థ లేకపోయినా విదేశాలు భారత్ పై దాడులు చేయవని నెహ్రూ భావించేవాడు. ఈ విధంగా భావించడమే కాదు తన ఆలోచనా సరళిని.. ఆచరణాత్మకంగా అమలు చేసే ప్రయత్నం కూడా చేశాడు.

  ఇందులో భాగంగా తాను ప్రవేశపెట్టే బడ్జెట్ లో భారత రక్షణ శాఖకు నిధుల కోత విధిస్తూ వచ్చాడు నెహ్రూ. మెట్టమొదటిగా 1959లో ఏకంగా 25 కోట్ల మేరకు బడ్జెట్ లో కోత విధించాడు. దీంతో రక్షణ దళాలకు కావాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోయింది. కావాల్సిన ఆయుధాలను సైతం సమకూర్చుకోలేక సతమతమైంది. ఈ పరిణామాలతో అప్పటికే భారత్ పై దాడి చేయాలని గుంటనక్కలా కాచుకు కూర్చున్న చైనా.. భారత్ పై యుద్దానికి పూనుకుంది. కోత విధించిన సరిగ్గా మూడేళ్ళకే భారత సైన్యం దీనావస్థను అదనుగా చేసుకుని దాడిచేసింది. అప్పటికీ చైనాతో భారత్ పోరాడే దశలోనే ఉన్నా కూడా.. డ్రాగన్ కంట్రీకి భయపడ్డ నెహ్రూ సైన్యానికి సరైన నాయకత్వం అందించలేకపోయాడు. అవినీతిలో ఆరితేరిన అప్పటి రక్షణశాఖా మంత్రి వీకే కృష్ణమీనన్ స్వతహాగా వామపక్ష భావజాలికుడు. దీంతో భారత సైన్యానికి సరైన నాయకత్వం దొరకలేదు. ఈ పరిణామాలతో ఒంటిచేత్తో మూడొందల మంది చైనా సైనికులను చంపే ధైర్యమున్న.. జశ్వంత్ సింగ్ రావత్ లాంటి సైనికులున్నా.. నాయకత్వ లేమితో ఆ యుద్దంలో పరాజయం పాలు కాకతప్పలేదు.

  అయితే ఇండో-చైనా యుద్దం తర్వాత కానీ తత్వం బోధపడలేదు. ఈ యుద్దంలో భారత్ ఓడిపోవడంతో సైన్యం విలువ తెలిసొచ్చింది నెహ్రూకు. 1949లో టిబెట్‎ను చైనా ఆక్రమించుకునేటప్పుడు చైనా సైన్యానికి ఆహారం వంటివి సప్లై చేస్తే ఆ దేశం భారత్ పైకి యుద్దానికి రాదన్న మూర్ఖపు ఆలోచనకు కూడా ఈ యుద్దంతో నెహ్రూకు బోధపడింది. అయితే నెహ్రూ అనుకున్నట్లుగా సైన్యం లేని భారతాన్ని ఊహించగలమా..? ఓసారి జపాన్ పరిస్థితులను గుర్తు చేసుకుంటే.. అది ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులతో దాడులు చేసినప్పుడు జపాన్ తీవ్రంగా నష్టపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జపాన్ దాదాపుగా సొంతంగా రక్షణ వ్యవస్థ ఏర్పరచుకోలేకపోయింది. చివరికి తమపై అణుబాంబులు వేసిన అమెరికాపైనే ఆధారపడింది. అమెరికన్ రక్షణ వ్యవస్థే జపాన్ కూ రక్షణ కల్పిస్తోంది. ఈ విధంగా భారత్ అటు అమెరికాపైనో రష్యా పైనో ఆధారపడి ఉంటే ఏమయ్యేది..? ప్రస్తుతం అటు అమెరికా, ఇటు రష్యా భారత్ కు సమాన దూరంలో ఉన్నాయి. ఆయా దేశాలు భారత్ ను ఎప్పుడూ మూడోతరగతి దేశంగా చూస్తూ తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూశాయి. అయితే రక్షణ వ్యవస్థ లేకపోయి ఉంటే,.. ఆయా దేశాలు చెప్పినట్లు భారత్ తలూపాల్సి వచ్చేది. 1996 కార్గిల్ యుద్దం సమయంలో కూడా పీఓకే ను భారత్ స్వాధీనం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నా ఈ రెండు అగ్రదేశాలే ఆ ప్రయత్నాన్ని ఆపాయి. అదే గనుక స్వీయ రక్షణ వ్యవస్థ లేకపోతే ఈ రెండు దేశాలు కలిసి పూర్తి కశ్మీర్ ను బంగారు పళ్ళెంలో పెట్టి పాకిస్తాన్ కు అప్పగించేవి. అటువైపు చైనా కూడా ఎప్పుడో ఈశాన్య రాష్ట్రాలను తన దేశంలో కలిపేసుకునేది. ఒక్కమాటలో చెప్పాలంటే భారత్ లో ఇప్పటికే సగభాగాన్ని ప్రపంచదేశాలు విడదీసేవి.

  అందుకే ఏ దేశానికైనా రక్షణ వ్యవస్థ అనివార్యం. మరో దేశం మనపై ఆజమాయిషీ చెలాయించకూడదంటే దృఢమైన రక్షణ వ్యవస్థ తప్పనిసరి. ఎప్పుడైతే ఒక దేశం వద్ద ధృఢమైన రక్షణ వ్యవస్థ ఉంటుందో.. అప్పుడే ఇతర దేశాలు మన మాట వినడం మొదలవుతుంది. అందుకే అణుబాంబులున్న దేశాలతో.. ఏదేశమూ యుద్దం చేసే సాహసం చేయదు. అటువంటి రక్షణ వ్యవస్థను పూర్తిగా అంతమొందిచే ప్రయత్నం చేసిన భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూ దూరదృష్టి ఏపాటిదో మీకు ఇట్టే అర్థమైవుంటుంది.

  Trending Stories

  Related Stories