More

  పాక్, చైనా గుండెల్లో AK-203..! మేడిన్ ఇండియా తుపాకులతో ముచ్చెమటలే..!!

  కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక భారత సైన్యానికి ఆయుధ కొరత లేకుండా చూస్తున్నారు. సైనికుల దగ్గర ఒకప్పుడు ఇన్సాస్ రైఫిళ్ళు ఉండేవి. వీటిని భారత ప్రభుత్వం మెల్ల మెల్లగా తొలగిస్తూ.. ఏకే 203 రైఫిళ్ళను రీప్లేస్ చేసింది. అయితే ఒకప్పటి ఇన్సాస్ రైఫిళ్ళను ప్రభుత్వం ఎందుకు రీప్లేస్ చేసినట్లు..? వీటితో పాక్, చైనాలను ఎదుర్కోలేమా..? ఏకే-203 శక్తి ఎంత..? వీటికి దీటుగా చైనా వాడే తుపాకులేంటి..? అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ముందు నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ ఛానెల్స్‎ను సబ్‎స్క్రయిబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, పదిమందికీ షేర్ చేస్తూ.. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.

  2022 జనవరి 25న మొదటి బ్యాచ్‎లో భాగంగా 70 వేల ఏకే-203 రైఫిళ్ళను భారత ప్రభుత్వం సైనికులకు అందించింది. ఆ తర్వాత విడతలవారీగా సైనికులకు తుపాకులను అందజేస్తూ వచ్చింది. ఇదే సంవత్సరం మే నెలలో ఐటీబీపీ జవాన్లకు ఈ రైఫిళ్ళను అందజేయడానికి చర్చలు జరిగాయి. ఈ తుపాకులు రష్యా టెక్నాలజీతో తయారుచేసినా,.. ఉత్పత్తి మాత్రం మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‎లోనే తయారు చేస్తున్నారు. యూపీలోని రాయ్ బరేలీలో వీటి తయారీ జరుగుతోంది. దేశ రక్షణ శాఖ ఈ తుపాకులను యుద్ద ప్రాతిపదికన తయారుచేయించి సైన్యానికి అందజేస్తోంది. దీంతో ఇప్పటివరకు సైనికుల చేతిలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్ళ స్థానంలో ఈ ఏకే-203 లు భర్తీ చేస్తున్నాయి. అయితే ఇన్సాస్ రైఫిళ్ళను సైనికుల నుంచి సీఆర్పీఎఫ్ పోలీసులకు అంతర్గత భద్రతా అధికారులకు బదిలీ చేశారు. దేశంలో జరిగే అల్లర్లలో ఈ పాతతరం తుపాకులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇన్సాస్ రైఫిళ్ళ నుంచి ఏకే-203 కు ఎందుకు మారాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

  భారత దేశానికి ప్రధాన శతృదేశాలు చైనా, పాకిస్తాన్‎. ఈ రెండు దేశాల సరిహద్దుల దగ్గర సైన్యం నిరంతర భద్రతను నిర్వర్తిస్తోంది. అనుక్షణం గస్తీ కాస్తూ దేశాన్ని రక్షిస్తుంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తరచూ సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి సరిహద్దుల దగ్గర కాల్పులు జరిపి భారత సైన్యానికి పెను ముప్పుగా మారుతోంది. ఇక ఉగ్రవాదులైతే సరిహద్దులు దాటడానికి చేసే ప్రయత్నాలను ఎల్లప్పుడూ అడ్డుకోవాలి. ముఖ్యంగా కశ్మీర్ లోయ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఉగ్రవాదుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరిని ఎదుర్కోవాలంటే,.. అంతే దీటైన ఆయుధాలుండాలి. అయితే, ఇప్పటివరకు భారత సైన్యం దగ్గర ఇన్సాస్ తుపాకులు మాత్రమే ఉండేవి. వీటిని 1998లో మొదటిసారిగా భారత సైన్యానికి అందించారు. ఈ తుపాకులను ఎస్ఎల్ఆర్ అనే పాతకాలం తుపాకులను మోడిఫై చేసి తయారు చేశారు. అయితే ఇవి అప్పటికాలంలో సరిపోయాయి. వీటిని కార్గిల్ వార్ లోనూ, నేపాలీ సివిల్ వార్ లోనూ, నక్సల్ తీవ్రవాదాన్ని అణచివేసేందుకు భారత సైన్యం ఉపయోగించి విజయాలు సాధించింది.
  అయితే 2010 తర్వాత ఆయుధాలను అప్‎గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటికే ఉగ్రవాదులు ఏకే-47లను వాడటం మొదలుపెట్టారు. దీంతో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఇన్సాస్ తుపాకులు అంతగా ఉపయోగపడేవి కావు. ఇవి ఆటోమేటెడ్ తుపాకులే అయినా ఏకే-47 అంతటి శక్తితో పోరాడలేని పరిస్థితుల్లో ఉండేవి. దీంతో ఉగ్రవాదులు ఎదురైనప్పుడు వారితో పోరాటం చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సి వచ్చేది. దీంతో పాటు భారత్ కు మరో శతృదేశమైన చైనా 2019నుంచి QBZ-191 తుపాకులను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఈ తుపాకులు ఇన్సాస్ తుపాకుల కంటే ఎంతో శక్తివంతమైనవి. అంతేకాదు,.. ఇవి ఏకే 47 కంటే ఎంతో అత్యాధునికమైనవి కాబట్టి వీటితో ఇన్సాస్ తుపాకులతో పోరాడటం చాలా ఇబ్బంది అని మోదీ ప్రభుత్వం గుర్తించింది.

  అందుకే భారత సైన్యానికి అత్యాధునిక తుపాకులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి అవసరాలకు తగ్గట్లుగా చైనా QBZ-191 తుపాకులకు దీటుగా ఉండే తుపాకులను భారత సైన్యం తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో రష్యా టెక్నాలజీ తో తయారు చేసిన ఏకే-203 తుపాకులైతే వీటికి దీటుగా పనిచేయగలవని భారత సైన్యం భావించింది. ఒక్కసారి ఈ రెండు తుపాకులను పరిశీలిస్తే,.. ఏకే-203 లో 7.62 ఎంఎం బుల్లెట్లను ఉపయోగిస్తే,.. QBZ-191 లో 5.8 ఎంఎం బుల్లెట్లను వాడతారు. ఈ రెండు తుపాకుల ఫైరింగ్ రేంజ్ సరిసమానంగా 400 మీటర్ల వరకూ టార్గెట్‎ను నాశనం చేయగలవు. అయితే భారత్ ఉపయోగించే ఏకే-203 రైఫిళ్ళలో చిన్న సర్దుబాట్లతో ఫైరింగ్ రేంజ్‎ను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండు తుపాకుల్లో కూడా బుల్లెట్ల మ్యాగజీన్ సరిగ్గా ముప్పై బుల్లెట్లు పట్టేలా ఉంటుంది. అవసరాన్ని బట్టి వీటిని పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే బుల్లెట్ల ఫైరింగ్ స్పీడ్ లో మాత్రం చైనా QBZ-191 కాస్త ఎక్కువగా నిమిషానికి 750 రౌండ్లను పేల్చగలిగితే భారత ఏకే 203 లో మాత్రం నిమిషానికి 700 బుల్లెట్లు ఫైరింగ్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అయితే ఈ వ్యత్యాసం పెద్దగా ప్రభావం చూపలేదని రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ వివరాలను బట్టి చూస్తే చైనా వాడుతున్న QBZ-191 కు దీటైన జవాబు చెప్పగలదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

  ఇక చైనా తుపాకులకు ఎదురొడ్డి పోరాడే ఏకే 203 తుపాకులకు పాకిస్తాన్ వాడుతున్న ఏకే 47 తుపాకులు పెద్ద సమస్య ఏమీ కాదనీ పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు వాడుతున్నవి అత్యాధునిక టెక్నాలజీవి కావడంతో ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  Trending Stories

  Related Stories