National

క్రికెట్ లీగ్ పేరు చెప్పి.. రష్యన్స్ ను బాగా మోసం చేశారు..!

మోసం చేయాలని అనుకుంటే ఎలాగైనా మోసం చేయవచ్చు.. ఎంతో తెలివైన వ్యక్తులకు కూడా టోకరా వేయించవచ్చు. భారత్ లో క్రికెట్ ఎంతో ఫేమస్ అనే విషయం అందరికీ తెలిసిందే..! కానీ కొందరు అదే క్రికెట్ ను ఉపయోగించి బడా మోసానికి దిగారు. గుజరాత్ లో ఉంటూ రష్యాలో ఉన్న వాళ్లకు ఏకంగా ఒక లీగ్ విషయం టోకరా వేశారు. అధికారిక టోర్నీ రేంజిలో బిల్డప్ ఇచ్చి మోసం చేశారంటే.. ఎంత మాయ చేశారో మీరే అర్థం చేసుకోవచ్చు.

గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని ఒక గ్రామంలో.. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన మూడు వారాల తర్వాత కొత్త లీగ్ ను మొదలు పెట్టారు. అద్భుతమైన మరొక T20 క్రికెట్ లీగ్ అని చెప్పి రష్యన్ జూదగాళ్లను ఈ టోర్నీ వైపు మల్లేలా చేశాడు. వ్యవసాయ కూలీలు క్రికెటర్లుగా నటించడం, క్రికెట్ గ్రౌండ్‌గా పొలాలను మార్చేశారు. వ్యాఖ్యానం కోసం హర్షా భోగ్లే లాంటి వాళ్లను తీసుకుని వచ్చి రష్యన్లను బాగా మోసం చేశారు. బెట్టింగ్‌ కోసం ప్రత్యేకంగా టెలిగ్రామ్ ఛానెల్‌ ను ఏర్పాటు చేశారు. ఏకంగా దీనికి “ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్” అని పేరు పెట్టారు. నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేయడానికి ముందు.. ఈ మోసపూరిత టోర్నమెంట్ ఏకంగా క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది.

రష్యా లోని ట్వెర్, వొరోనెజ్, మాస్కో వంటి ప్రాంతాల నుండి బెట్టింగ్ వేస్తూ ఉండేవారు. గ్రామస్థులు కూడా రష్యన్‌ల నుండి బెట్టింగ్ లను అంగీకరించారు. మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయడానికి హై-రిజల్యూషన్ కెమెరాలు ఉపయోగించారు. “IPL” అనే యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. 21 మంది వ్యవసాయ కూలీలు మరియు గ్రామంలోని నిరుద్యోగ యువకుల బృందం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జెర్సీలను ధరించి తమ రష్యన్ ప్రేక్షకులకు అసలు IPL జరుగుతోందని అభిప్రాయాన్ని కలిగించారు. అంపైర్‌లను కూడా తీసుకుని వచ్చారు, వారికి వాకీ-టాకీలు ఇచ్చారు. రష్యాన్స్ ను నమ్మించడానికి 5 హై-డెఫినిషన్ కెమెరాలను ఉపయోగించారు. క్రికెట్ మ్యాచ్‌లో సాధారణంగా వినిపించే ప్రేక్షకుల వాయిస్.. ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేశారు. మ్యాచ్ సమయంలో ప్లే చేశారు. మీరట్‌కు చెందిన హర్షా భోగ్లే డూప్ మిమిక్రీ సేవలు కూడా టోర్నమెంట్ కోసం ఉపయోగించారు. టెలిగ్రామ్ ఛానెల్‌లో బెట్టింగ్ భారీగా నిర్వహించారు.

క్రికెట్ పోటీల నెపంతో సాగుతున్న అక్రమాలను మెహసానా పోలీసులు గుర్తించడంతో ‘టోర్నమెంట్’ ఒక్కసారిగా నిలిచిపోయింది. పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు చేపట్టిన హవాలా బాగోతాన్ని కూడా విచారిస్తున్నారు. బెట్టింగ్‌లకు ప్రసిద్ధి చెందిన రష్యన్ పబ్‌లో ఎనిమిది నెలలు పనిచేసిన తర్వాత మోలిపూర్‌కు తిరిగి వచ్చిన షూబ్ దావ్దా అనే వ్యక్తి ఈ ప్లాన్ ను అమలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దావదా గులామ్ మసీహ్ అనే వ్యక్తి పొలాన్ని అద్దెకు తీసుకుని అక్కడ హాలోజన్ లైట్లను అమర్చారు. ఒక్కో మ్యాచ్ కు రూ.400 ఇస్తానని హామీ ఇస్తూ.. 21 మంది వ్యవసాయ కూలీలను తీసుకుని వచ్చారు. వారికి ఐపీఎల్ జెర్సీలను వేశారు.

పోలీసులతో జరిపిన విచారణలో షూబ్ దావ్దా రష్యన్ పబ్‌లో పని చేస్తున్నప్పుడు పరిచయమైన ఆసిఫ్ మహ్మద్ ఈ మోసానికి సూత్రధారి అని చెప్పాడు. రష్యాకు చెందిన వ్యక్తులకు క్రికెట్‌ ను పరిచయం చేయించి.. ఆసిఫ్ బెట్టింగ్ వేపించడం మొదలుపెట్టాడని దావ్దా చెప్పుకొచ్చాడు. షూబ్ దావ్దా మోలిపూర్‌ లో షూబ్ దావ్దా, సాకిబ్, సైఫీ, మహమ్మద్ కోలుతో కలిసి పని చేశాడు. ఇటీవల వారికి బెట్టింగ్ డబ్బులు అందడం.. ఫేక్ ఐపీఎల్ టోర్నీ ఫిక్స్ అయిందని పోలీసులకు తెలియడంతో అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Back to top button