మధ్యప్రదేశ్ లో మరోసారి బుల్డోజర్లకు పని చెప్పిన అధికారులు

0
697

బ్యాలెట్ బాక్సా ఎత్తుకెళ్లేందుకు అధికారులపై దాడి చేసిన నిందితులపై అధికారులు కొరడా ఝళిపించారు. తొమ్మిది మంది నిందితుల ఇళ్లను బుల్జోజర్లతో కూల్చేశారు.

మధ్యప్రదేశ్‌లోని గూంజ్ పంచాయతీలో పోలింగ్ బూత్ వద్ద జిల్లా అధికారులపై గత శనివారం దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు 59 మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. నిందితుల్లో పంచాయత్ సెక్రటరీ కపిల్ శర్మ, దిలీప్ శర్మ, హర్పాల్ తదితరులున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులుమూడెంచల ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్‌ జరుగుతుండగా గూంజ్ పంచాయతీలోని పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొందనే సమాచారంతో తహసిల్దార్ రాజ్‌కుమార్ నగోరియా, ఎక్సైజ్ అధికారి నిధి జైన్ చేరుకున్నారు. పోలింగ్ పార్టీ బయటకు వచ్చేసరికి సుమారు 100 మంది వ్యక్తులు ఆయుధాలు ధరించి పోలీసు అధికారులపై దాడికి దిగారు. బ్యాలెట్ బాక్సు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వ విధులకు అంతరాయం కలిగించి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, హత్యాయత్నానికి పాల్పడ్డారనే అభియోగాలపై 9 మంది పరిచితులు, 50 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసు పెట్టారు. తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురు బాందా గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు, జిల్లా అధికారులు సవాలుగా తీసుకున్నారు. నిందితుల ఇళ్లను కూల్చివేసేందుకు భారీ పోలీసు భద్రత మధ్య రెండు జేసీబీ మెషీన్లు పంపారు. అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ రాయ్‌సింగ్ నార్వారియా, తహసిల్దార్ నరేష్ శర్మ ఈ కూల్చివేతలను పర్యవేక్షించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here