మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇది పరువు హత్య అని చెబుతూ ఉన్నారు. గర్భిణీ సోదరి తల నరికి అతి దారుణంగా హత్య చేశాడు ఓ 18 ఏళ్ల బాలుడు. ఈ దారుణ ఘటన ఔరంగాబాద్ జిల్లా పరిధిలో జరిగింది. తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు 19 ఏళ్ల గర్భిణీ స్త్రీని ఆదివారం తల్లి సహాయంతో ఆమె సోదరుడు తల నరికి చంపాడు. బాధితురాలిని చంపిన తర్వాత ఆమె తలను బయటకు తీసుకువచ్చి అందరి ముందు ప్రదర్శించారు. తమ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నందుకే తమ కుమార్తెను చంపేశామని తల్లి ఇరుగుపొరుగు వారికి కూడా చెప్పినట్లు పోలీసులు చెప్పారు. ఆరు నెలల క్రితం యువతి వివాహం చేసుకుంది. తల్లి, సోదరుడు ఆమెతో రాజీ కుదుర్చుకునే నెపంతో ఆమె ఇంటికి వెళ్లారు. గర్బిణీ, ఆమె సోదరుడు, తల్లి ఏకాంతంగా మాట్లాడుకునేందుకు వీలుగా ఆ గర్బిణీ భర్త అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మహిళ టీ చేయడానికి వంటగదికి వెళ్లగా, పదునైన ఆయుధంతో వచ్చిన సోదరుడు ఆమెపై దాడి చేసి గొంతు కోశాడని పోలీసు అధికారులు తెలిపారు. భర్త ఆమెను రక్షించే సమయానికి బాధితురాలి సోదరుడు ఆమె తల నరికి చంపాడని వారు తెలిపారు. తనపై కూడా దాడి జరుగుతుందనే భయంతో బాధితురాలి భర్త ఇంటి నుంచి పారిపోయాడు. తల్లి, సోదరుడు విర్గోన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి నేరం అంగీకరించారు.
ఔరంగాబాద్ జిల్లాలోని గోయ్‌గావ్ గ్రామంలో చోటు చేసుకుంది. తమ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నందుకే తమ కుమార్తెను చంపేశామని తల్లీకొడుకులు ఇరుగుపొరుగు వారికి చెప్పినట్లు పోలీసులు నిర్ధారించారు. మరణించిన కీర్తి థోర్ ఈ సంవత్సరం ప్రారంభంలో కాలేజీ స్నేహితుడిని వివాహం చేసుకుంది. తన సోదరిని హత్య చేసిన తర్వాత, సోదరుడు కత్తిరించిన తలతో వరండాలోకి వెళ్లినట్లు పోలీసులు ధృవీకరించారు. తర్వాత అందరూ చూసేలా గాలిలో ఎగరేశాడు. పోలీసులకు లొంగిపోయే ముందు అతను, తన తల్లితో కలిసి కత్తిరించిన తలతో సెల్ఫీలు తీసుకున్నాడు.
ఈ సంఘటన గురించి పోలీసు సూపరింటెండెంట్ నిమిత్ గోయల్ మాట్లాడుతూ అతడు తీసుకున్న ఫోటోలను తిరిగి పొందడానికి ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం సెల్‌ఫోన్‌ను పంపుతామన్నారు. కీర్తి థోర్ జూన్‌లో పారిపోయి తన భర్తతో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ పెళ్లిని ఆమె కుటుంబం వ్యతిరేకించింది. బాధితురాలి తలను సొంత సోదరుడు కొడవలితో నరకగా.. ఆమె తల్లి కుమార్తె కాలును కదపకుండా పట్టుకుంది. ఆ తర్వాత ఇరుగుపొరుగు వారు చూపించేందుకు తలను బయటికి తీసుకెళ్లాడు. బాధితురాలి సోదరుడు విర్గావ్ పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయాడని, అతని తల్లిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.