హిజ్బుల్ తీవ్రవాదిని కాల్చి చంపిన సైన్యం

0
892

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు మరణించాడు. ఈ ఎన్ కౌంటర్ సమయంలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్ ను కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికులతో పాటు ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులను వాయు మార్గంలో శ్రీనగర్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు.

“Terrorist Commander of proscribed #terror outfit HM Nisar Khanday killed. #Incriminating materials, #arms & ammunition including 01 AK 47 rifle recovered. #Operation in progress,” అని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. మరణించిన హిజ్బుల్ కమాండర్ ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఓ ఏకే-47 రైఫిల్ ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.