ఏప్రిల్ ఫూల్స్ వేలం వెర్రి మనకు అవసరమా..?

0
733

కొన్ని అంతర్జాతీయ దినోత్సవాలకు అర్థం, పర్థం వుండదు. వాటి చరిత్రేంటో కూడా తెలియకుండా ప్రపంచం మొత్తం వేలంవెర్రిగా సెలబ్రేట్ చేసుకుంటుంది. వాటిలో ఒకటి ‘ఫూల్స్ డే’. ఏప్రిల్ 1న తెల్లవారిందంటే చాలు.. ఒకరినొకరు ఫూల్స్ చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. ఏమీ లేకున్నా ఉన్నట్టు నమ్మించడం, అబద్ధపు వార్తల్ని ప్రచారం చేయడం, జరగని విషయాన్ని భయభ్రాంతులకు గురిచేయడం.. అబ్బో ఇలాంటి తిక్క వేషాలు చాలానేవుంటాయి. ఇలా మనం చెప్పేది గుడ్డిగా నమ్మితే.. ఎదుటివాడు ఫూల్ అయినట్టు గేలిచేస్తూవుంటారు. ఇలా ఏప్రిల్ 1న జరుపుకునే ఫూల్స్ డేను.. నలుగురిలో నారాయణ అన్నట్టు మనం కూడా పాటిస్తూవుంటాం.

అసలు ఫూల్స్ డే ఎలా పుట్టింది..? మన సంస్కృతికి, సంప్రదాయానికి ఏంటి సంబంధం అని ఒక్కడు కూడా ఆలోచించడు. ప్రపంచమంతా జరుపుకుంటున్నారు కాబట్టి మనం కూడా జరపుకోవాలి. చాలామందికి తెలిసిందంతే. అసలు ఫూల్స్ డే సెలబ్రేట్ చేసుకోవడమంటేనే మనంతట మనం ఫూల్స్ అయినట్టు లెక్క. ఫూల్స్ డే చరిత్ర చెబుతున్నది కూడా అదే. అసలు ఈ ఫూల్స్ డే ఎలా జరుపుకుంటారో తెలిస్తే.. మీరే అసహ్యించుకుంటారు. మొట్టమొదటిసారిగా యూరప్ లో ప్రారంభమైన ఈ ఫూల్స్ డే.. ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి పాకింది. అతీగతి లేని గ్రెగోరియన్ క్యాలెండర్ వల్ల ఈ ఫూల్స్ డే పురుడుపోసుకుంది.

1582 సంవత్సరానికి ముందు.. యూరోప్‌లో మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు నూతన సంవత్సర వేడుకలు జరిగేవి. 1582లో మాత్రం జూలియన్ క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రేగరీ ఓ కొత్త క్యాలెండర్‌ని విడుదల చేశారు. దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని అప్పట్లో చాలా దేశాలు తిరస్కరించాయి. ఆ క్యాలెండర్‌ని అనుసరించమని తేల్చి చెప్పాయి. కానీ, కొంతమంది ప్రజలు మాత్రం.. గ్రెగోరి వైపు మొగ్గుచూపారు. జనవరి 1న మాత్రమే కొత్తసంవత్సరం వేడుకలు జరుపుకునేవారు. అంతేకాదు.. ఏప్రిల్ ఒకటిన కొత్త సంవత్సరం అని నమ్మేవారిని ఫూల్స్‌గా జమకట్టి ‘ఏప్రిల్ ఫూల్స్’, ‘ఏప్రిల్ ఫిష్’ అని ఏడిపించేవారు.

దీంతో.. అప్పట్నుంచి ఏప్రిల్ 1 ఫూల్స్ డే గా మారింది. కాలక్రమంలో ఈ పనికిమాలిన సంప్రదాయం ప్రపంచం మొత్తం పాకిపోయింది. అసలు జులియస్, గ్రెగోరి క్యాలండర్లే ఓ అతీగతి లేదు. కాలగణనలో ఎలాంటి ప్రామాణికత లేని క్యాలెండర్లవి. కానీ, భారత్‎లో మాత్రం వేల ఏళ్ల ముందునుంచే కాలగణన ఎంతో సశాస్త్రీయంగా జరిగింది. సూర్యమానం, చంద్రమానం ప్రామాణికంగా మన ఖగోళ శాస్త్రవేత్తలు, రుషులు కాలగణన చేసేవారు. వాటి ఆధారంగానే శక క్యాలెండర్ ఏర్పడింది. దురదృష్టం కొద్దీ.. మనం ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న గ్రెగొరీ క్యాలెండర్ నే అసుసరిస్తున్నాం. అదీ చాలదన్నట్టు ఆ అతీగతి క్యాలెండర్ వల్ల ఏర్పడిన.. ఏప్రిల్ ఫూల్స్ వంటి సంప్రదాయాలను కూడా ఫాలో అవుతుండటం సిగ్గుచేటు కాక మరేమిటి..?

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × five =