మైసూర్ రాజ్యంలో టిప్పు సుల్తాన్ జరిపిన దుర్మార్గాలపై అనేక మంది పుస్తకాలు రాశారు. అంతేకాదు టిప్పు సుల్తాన్ విలనా…లేక హీరో అనే అంశంపై…వివిధ ప్రముఖలు రాసిన వ్యాసాలు, పరిశోధనలతో… ప్రముఖ చరిత్రకారుడు సీతారాం గోయల్ Tipu Sultan- Villain or Hero పేరుతో గ్రంథాన్ని ప్రకటించాడు కూడా..! అటు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ కూడా…ఆనాటి మరాఠా సాహిత్యకారుల రచనల ఆధారంగా.., మైసూర్ రాజ్యంలో టిప్పు జరిపిన అరాచకాలను కళ్లకు కట్టినట్లుగా వివరించాడు..!
ఒక దశలో The Sword of Tipu Sultan నవల రచయిత భగవాన్ గిద్వాని తాను రాసిన టిప్పు నవల అంతా కూడా కల్పితమని.., అదంతా చారిత్రక కల్పనలతోనే రాశానని ఒప్పుకున్నాడు..! అందుకే దూరదర్శనల్ ప్రసారమైన టిప్పు సీరియల్ ప్రారంభంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది.! అయినా కూడా కుహనా సెక్యులర్ మేధావులు, లెఫ్ట్ లిబర్ , కాంగ్రెస్ నేతలు, మార్క్స్ , మేకాలేవాద చరిత్రకారులు టిప్పును నేషనల్ హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ ఈ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తమ చేతుల్లోని మీడియా ద్వారా టీవీ మాద్యమం ద్వారా ప్రజలను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే టిప్పు సుల్తాన్…హిందువులపై జరిపిన మతోన్మాదదాడులను కొంతమంది ముస్లిం చరిత్రకారులు అతన్ని ఏకంగా టర్కీ ఖలీఫాతో పోల్చారు. ఒక దశలో టిప్పు జరిపిన అరాచకాలు తెలుకున్న ఆనాటి హిందూ ధర్మరక్షణ కంకణధారులైన మరాఠాలు ఆగ్రహం అతనిపై వ్యక్తం చేశారు. మరాఠా సైన్యాలు…టిప్పు మీద దండయాత్ర జరపమని పెష్వా ఆదేశించాడు కూడా..! తనపై మరాఠా హిందూ సైనికులు యుద్ధానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న టిప్పు…కిత్తూరు, నరగుండ్ వంటి మరాఠా ప్రాంతాలను సైతం తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ రోజుల్లో నరగుండ్ , కిత్తూరు ప్రాంతాలకు బ్రాహ్మణులే పాలకులుగా ఉన్నారు. మొత్తం హిందూ సమాజాన్ని ద్వేషించే టిప్పు…, ప్రత్యేకించి బ్రాహ్ముణులంటే మరి మండిపడేవారని అంటారు. తనకు మంత్రిగా పండిత్ పూర్ణయ్యను తన తండ్రి హైదర్ ఆలీ కోరిక మేరకే పెట్టుకున్నాడు. ఎప్పుడైనా మరాఠాలతో వైరం వస్తే…పూర్ణయ్యను వాడుకోవచ్చనే తలంపుతోనేనని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
నరగుండ్ రాజు భావే…టిప్పు సైన్యాన్ని వీరోచితంగానే ఎదుర్కొన్నాడు. అయితే ఆయనకు సకాలంలో పూనా నుంచి సైనిక సహకారం అందలేదు. నరగుండ్ పట్టణం వశంకాగానే టిప్పు దానికి నిప్పు పెట్టించాడు. ప్రజలను దోచుకుని…, రాజైన భావేను, సేనాపతిని సంకేళ్లతో బంధించాడు. అంతేకాదు అంతఃపురంలో జొరబడి అక్కడి రాణులను బంధించాడు. రాజ వంశానికి చెందిన యువతులను బంధించి తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత మరో హిందూ రాజ్యమైనప కిత్తూరు పైనా విరుచుకుపడ్డాడు టిప్పు. ఆ పట్టాణాన్ని సైతం సర్వనాశనం చేశాడు.
అటు మహారాష్ట్ర సైన్యం కర్ణాటకలో టిప్పు జయించిన ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటూ వేగంగా ముందుకు వచ్చింది. మరాఠా సర్దారులు పట్వర్థన్, ఫడ్కే, బేహరే…, టిప్పు సైన్యానాలను వెంటాడి ఓడించి కర్ణాటకను వశం చేసుకున్నారు. అంతేకాదు జట్లుగా వీడిపోయిన మరాఠా సైన్యాలు టిప్పును కూడా వెంబడించి అతన్ని కూడా పట్టుకున్నాయి.
అదే సమయంలో మరాఠాల చేతికి టిప్పు చిక్కాడని తెలిసి…ఇటు బ్రిటీష్ వారు కూడా మైసూరు రాజ్యంపై విరుచుకుపడ్డారు. యుద్ధంలో అటు మరాఠాలు, ఇటు ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయిన టిప్పు.., చివరకు సంధి బేరాలకు వచ్చాడు.సంధి ఒప్పందంలో అపరాధ రుసుం చెల్లించేందుకు కూడా ఒప్పుకున్నాడు. జమానతుగా తన ఇద్దరు కుమారులు, మరాఠాలతోపాటు, ఆంగ్లేయుల వద్ద ఉంచుకోవాలంటే పంపాడు. ఈ విషయంపై నాటి మరాఠా సేనాధిపతి శ్రీహరిపంత్ ఫడ్కే…నాటి పేష్వా నానా సాహెబ్ కు రాసిన లేఖలో వివరంగా తెలిపాడు. లార్డ్ కారన్ వాలీస్ ఆ ఇద్దరు పిల్లలను తన వద్దకు పంపాడని…, వాళ్లు తనను చూసి ఆకలితో ఆలమటిస్తున్నామని…, తమకు తినడానికి ఏమైనా పెట్టాలని కోరారని.., వారికి భోజనం పెట్టి తిరిగి ఆంగ్లేయుల వద్దకే పంపానని ఆ లేఖలో పేర్కొన్నాడు ఫడ్కే.!
కానీ ఇదే సందర్భంలో ఒక విషయం హిందూ సమాజం గుర్తు పెట్టుకోవాలి. క్రీ.శ 1700 సంవత్సరాలకు అటు ఇటుగా… పంజాబ్ లో హిందూ ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్నా సిక్కుల పదవ గురువు గురుగోవింద్ సింగ్ కుమారులు ఇద్దరు…సర్ హింద్ ముస్లిం నవాబు చేతికి చిక్కినప్పుడు వ్యవహారించిన తీరును హిందూ సమాజం మార్చిపోరాదు. చిన్నారులైన జోరావర్ సింగ్, ఫతే సింగ్ లను సర్ హింద్ నవాబు చిత్రహింసలకు గురిచేశాడు. వారిని ముస్లింలుగా మారాలని భయపెట్టాడు. అంతేకాదు ముస్లింలుగా మారలేదనే కోపంతో వారిని…నిలబెట్టి, చుట్టుగోడ కట్టి సజీవ సమాధి చేశాడు. ఆ గురుదేవుని బిడ్డలు ప్రాణాలు వదిలారు కానీ…, మతం మాత్రం మారలేదు. ఇది నాటి మన దేశాన్ని పాలించిన ముస్లిం నవాబుల క్రూరత్వం!
మొత్తానికి మరాఠాల కత్తివేటు దెబ్బపడగానే…టిప్పు సుల్తాన్ కు పట్టిన ముస్లింమతోన్మాద మత్తు వదిలిందని మహారాష్ట్ర చరిత్రకారులు చెబుతారు! గతంలో తాను కూల్చివేసిన ఒకటి రెండు మందిరాలకు దానం చేశాడని అంటారు. అంతేకాకుండా శృంగేరి శంకర పీఠానికి కానుకలు కూడా ఇచ్చాడని..లేఖలు కూడా రాశాడని కొంతమంది కుహనా చరిత్రకారులు గుర్తు చేస్తారు. ఈ లేఖలను చూపి టిప్పును పరమత సహనం కలిగిన ఓ గొప్ప రాజుగా చూపించేందుకు లెఫ్ట్ లిబరల్ , కాంగ్రెస్ వాదులు, ఇంకా మార్క్స్, మేకాలేవాద చరిత్రకారులు హిందువులపై అతడు చేసిన అత్యాచారాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని… ఇప్పటికీ కూడా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.!
అంతేకాదు కర్ణాటకలో అయితే కాంగ్రెస్ వాదులు టిప్పు పేరున కొత్తగా జయంతి ఉత్సవాలు నిర్వహించే సరికొత్త సంప్రదాయాన్ని మొదలు పెట్టారు. ఇస్లాంలో వ్యక్తి పూజకు స్థానం లేదు. ఇదంతా కేవలం ముస్లింల ఓట్ల కోసమేనని జయంతి ఉత్సవాలను ప్రారంభించిన రోజు నుంచి కూడా జాతీయవాద సంఘాలు, ముఖ్యంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా కాంగ్రెస్ వాదులు టిప్పు జన్మదినోత్సవం నిర్వహించే రోజునే…జాతీయవాదులు, హిందువులు శివాజీ చేతిలో హతమైన అఫ్జల్ ఖాన్ వధకు గుర్తుగా శౌర్యదివస్ ను కర్ణాటకలో నిర్వహిస్తున్నారు.