More

    హిందుత్వంపైనా, ఆలయాలపైనా ‘అఖండ’ లో హైలైట్ అయిన డైలాగ్స్

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఓ పాత్రలో రైతుగా.. మరో పాత్రలో అఘోరాగా బాలకృష్ణ సందడి చేశారు. ముఖ్యంగా అఘోర పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. హిందుత్వంపైనా, దేవాలయాలపైనా జరుగుతున్న దాడులకు స్పందించాల్సిందేనని తెలియజేశాడు. దేవాలయాలను విధ్వంసం చేసేవారి దుష్టులు గురించి, పరమాత్ముడు గురించి , చాలా చక్కగా అద్బుతంగా చూపించారు. అలాగే మంచి సంభాషణలు కూడా రాయడం జరిగింది.

    హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూసినా.. పంచభూతాలకు విరుద్ధంగా ప్రవర్తించేలా ప్రవర్తించినా కూడా పరమాత్మడు ఏదో ఒక రూపంలో వచ్చి దుష్టులను శిక్షిస్తాడు అని తెలియజేశారు. హిందూత్వాన్ని తట్టి లేపే పవర్ఫుల్ డైలాగ్స్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని పలువురు చెప్పుకొచ్చారు. ఆలయాలను నాశనం చేసే సన్నివేశంలో అఘోర చెప్పే డైలాగ్స్, విజ్ఞానం ఎంత ముందుకు వెళ్లినా వినాయకుడికి మొక్కకుండా ఉండగలమా అంటూ ఇలా ఎన్నో హిందుత్వానికి సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి.

    పలువురు హిందువులు సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో పోస్టులు కూడా పెడుతున్నారు. ‘అఖండ చిత్రం ప్రతి ఒక్క హైందవ సోదరులు చూడాలని మనవి మనలా ఆలోచించే ప్రతిఒక్కరికీ ఆ చిత్రంలో ఉన్న మెసేజ్ ఏంటని అర్థమవుతుంది ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి హిందూ సోదరులను చైతన్య పరుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అది సినిమా కాదు ఒక ధర్మ సందేశం జై శ్రీ రామ్’ అంటూ పలువురు షేర్ చేస్తూ ఉన్నారు. ‘అద్బుతమైన మూవీ చక్కగా చూపించారు. యదార్థమే చూపించిన ముఖ్యంగా బోయపాటి శ్రీను గారికీ హృదయపూర్వక ధన్యవాదాలు.’ అంటూ మరో నెటిజన్ పోస్టు చేశారు.

    ” అఖండ సినిమా.. లేక ఏ సినిమాలోనైనా సనాతన ధర్మ వైభవాన్ని ఏ కొంచెం చూపించినా ఆ సినిమాను భారతీయులంతా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి. దీనిని సినిమా వరకే చూడండి.దీనిని,దీనిలో నటించిన వారిని రాజకీయాలకు ముడిపెట్టొద్దు .సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా ఇండస్ట్రీలో మన భావజాలాన్ని పెంచాలని చూసే ప్రయత్నం లో భాగం ఈ ప్రమోషన్”. “సనాతన ధర్మ భావజాలంతో తీసిన సినిమాలను మన యథాశక్తి ప్రమోట్ చేయాలి”. “భారత్ పునర్వైభవ లక్ష్యం 2047 వ సం.(స్వాతంత్ర్యం అనుకునే 1947 సం.నికి వందేళ్ళు)”.ఈ రాబోయే 25 సం.లు కీలకం.అందుకు సహకరించే ప్రతీ ప్రయత్నాన్ని ఘనంగా స్వాగతించాలి, సత్కరించాలి.” అంటూ మరొకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

    Trending Stories

    Related Stories