International

హిందువులపై దాడి చేసి చంపి.. దుర్గా మండపాలను, విగ్రహాలను ధ్వంసం చేసి

ఫేస్‌బుక్ లోని ఓ పుకారుకు సంబంధించిన పోస్టు కారణంగా ఎంతో మంది హిందువులపై ముస్లింలు దాడి చేశారు. ఈ దాడులలో కొందరు అమాయక హిందువులు ప్రాణాలను కోల్పోయారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీ కమ్యూనిటీ దుర్గా పూజ చేసుకుంటూ ఉండగా.. కొన్ని గ్రూపులు వచ్చి మండపాలను ధ్వంసం చేశాయి. దుర్గా ఉత్సవం కాస్తా హింస మరియు విధ్వంసంతో ముగిసింది. విగ్రహాలను కొందరు పగులగొట్టగా.. పూజా సామాగ్రిని ధ్వంసం చేశారు మరికొందరు.

ఖురాన్‌ను హిందువులు అవమాన పరిచినట్లుగా ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ బుధవారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కొందరు మతోన్మాదులు వీధుల్లోకి వచ్చి అనేక దుర్గా మండపాలను ధ్వంసం చేశారు. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం ముగ్గురు హిందువులను చంపేశారు. ఎంతో మందిని గాయపరిచారు.

ఖురాన్‌ను అవమానించారనే వాదనలను ఖండిస్తూ కుమిల్లా మహానగర్ పూజ ఉజ్జపోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి శిబు ప్రసాద్ దత్తా మాట్లాడారు. గార్డు నిద్రపోతున్నప్పుడు ఎవరో కొందరు కావాలనే ననువా దిగిర్ పార్లోని దుర్గా పూజ మంటపం వద్ద ఖురాన్ కాపీని ఉంచినట్లు తెలియజేశారు. కొందరు కావాలనే దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు తీసి పారిపోయారు. కొన్ని గంటల వ్యవధిలో, ఫేస్‌బుక్ ఉపయోగించి, రెచ్చగొట్టే చిత్రాలతో ప్రచారం చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాతే-ఇ-ఇస్లాం కార్యకర్తలు హిందువులపై దాడులు చేశారని పలువురు ఆరోపించారు.

చంద్‌పూర్‌లోని హాజీగంజ్, చటోగ్రామ్ యొక్క బాంష్‌ఖలి, చాపై నవాబ్‌గంజ్ శిబ్‌గంజ్, కాక్స్ బజార్ లోని పెకువాలోని హిందూ దేవాలయాలపై దాడులు చేయడమే కాకుండా.. హిందూ భక్తులను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. హింసాత్మక ఘర్షణలో ముగ్గురు హిందువులు మరణించారు. బంగ్లాదేశ్ పోలీసులు మాత్రం దీనిని ధృవీకరించలేదు.

హిందువులపై దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్:

బంగ్లాదేశ్‌లోని అనేకమంది హిందువులు, హిందూ సంస్థలు విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. హిందువులపై దాడి చేసిన వీడియోను పలువురు షేర్ చేశారు “పరిస్థితి భయంకరంగా ఉంది !! శిల్పారాలో 150 కుటుంబాలపై దాడులు, కాక్స్ బజార్ లో విధ్వంసం, దోపిడీ, నోహాలీలో విధ్వంసం, మున్సిపల్ కాలిమందిర్‌లో విగ్రహాల విధ్వంసం, మహిళలపై వేధింపులు, చంద్‌పూర్‌లో 2 మంది చనిపోయారు” అంటూ పలువురు పోస్టులు పెట్టారు.

దుర్గా విగ్రహాన్ని నదిలో పడవేయడం వంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “బంగ్లాదేశ్‌లోని కొమిల్లాలో ముస్లిం బృందాలు 9 దుర్గా మండపాలను, విగ్రహాలను ధ్వంసం చేసింది. ఈ ఉదయం వందలాది మంది ముస్లింలు దాడి చేశారు. దాడి ఇంకా కొనసాగుతోంది. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంది. హిందువులు భయపడుతున్నారు. పరిస్థితిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు” అని హిందూ సంఘాలు ట్వీట్ చేశాయి.

Related Articles

Back to top button