More

    అక్కడ కూడా.. మసీదు పునరుద్ధరణ సమయంలో కనుగొనబడిన హిందూ దేవాలయం లాంటి నిర్మాణం

    కొద్దిరోజుల కిందట దేశ రాజధాని ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర్లో వున్న ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదు నిర్మాణం కోసం 27 దేవాలయాలు కూల్చేశారని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కె. కె. మొహమ్మద్ తెలిపిన సంగతి మనం విన్నాం. కుతుబ్ మినార్ సమీపంలో వినాయకుడి దేవాలయంతో పాటు.. పలు ఆలయాల అవశేషాలు కొనుగొనబడ్డాయని తెలిపారు. అందుకు సంబంధించిన రుజువులు కూడా వున్నాయని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా.. కె. కె. మొహమ్మద్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మొదటి ముస్లిం పాలకుడు కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ హయాంలోనే కుతుబ్ మినార్ నిర్మాణం జరిగింది. 73 మీటర్ల ఎత్తయిన ఈ మినార్ ను కూడా 27 హిందూ, జైన మందిరాల అవశేషాలను ఉపయోగించి నిర్మించినట్టు.. ఢిల్లీ టూరిజం వెబ్ సైట్ లో ఆధారాలతో సహా స్పష్టంగా రాయబడి వుంది. కుతుబ్ మినార్ తూర్పు ద్వారంపై వున్న శాసనం కూడా స్పష్టం చేస్తోందని.. ఇది స్వచ్ఛమైన ఇస్లామిక్ నిర్మాణమని.. కె.కె. మొహమ్మద్ తెలిపారు. గజినీ, ఘోరీ.. ఇతర మొఘల్ పాలకుల కాలంలో ఇలాంటి మినార్లు నిర్మించబడ్డాయని అన్నారు. కమ్యూనిస్టు చరిత్రకారులే తప్పుడు చరిత్రను చూపించి ముస్లింలను రెచ్చగొట్టారని ఆరోపించారు. ప్రధాన మసీదు లోపలి, బయటి భాగమంతా షాప్టులు,.. వాటి చుట్టూ పిల్లర్లతో నిర్మించారని అన్నారు. వీటిలో చాలావరకు షాఫ్టులు 27 ఆలయాలను కూల్చి సేకరించినవేనని.. అందువల్ల మసీదు హిందూ నిర్మాణ శైలిని పోలివుందని తెలిపారు కె. కె. మొహమ్మద్. కుతుబ్ మినార్ ప్రాంగణం నుండి గణేష్ విగ్రహాలను తరలించాలని నేషనల్ మాన్యెమెంట్స్ అథారిటీ కోరినట్టు నివేదికలు వచ్చాయి. అయితే, ఢిల్లీ కోర్టు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది. అంతేకాదు, విగ్రహాలను తొలగించవద్దని ASI ని ఆదేశించింది.

    Hindu temple-like structure

    ఇదిలా ఉంటే మంగళూరు ప్రాంతంలోని ఓ మసీదుకు సంబంధించిన రెనోవేషన్ వర్క్ జరుగుతూ ఉండగా హిందూ నిర్మాణ శైలికి సంబంధించిన పిల్లర్స్ కనిపించాయి. గురువారం మంగళూరు శివార్లలోని పురాతన మసీదు కింద హిందూ దేవాలయం లాంటి నిర్మాణ డిజైన్ కనుగొనబడింది. మంగళూరు శివార్లలోని మలాలిలోని జుమా మసీదు పునరుద్ధరణ పనులు చేస్తూ ఉండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మసీదు అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే ఈ ప్రదేశంలో హిందూ దేవాలయం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పత్రాలను ధృవీకరించే వరకు పనులు నిలిపివేయాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నాయకులు జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

    తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథంగా కొనసాగించాలని దక్షిణ కన్నడ కమిషనరేట్‌ ఆదేశించింది. అధికారులు భూ రికార్డులను పరిశీలిస్తున్నారని, శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “ఈ ఘటన గురించి క్షేత్రస్థాయి అధికారులు, పోలీసు శాఖ నుండి నాకు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం పాత భూ రికార్డులు, యాజమాన్య వివరాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తోంది. మేము ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, వక్ఫ్ బోర్డు నుండి నివేదికలు తీసుకుంటాము, ”అని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర చెప్పారు. ఈ విషయంపై వివిధ తనిఖీలను చేపడతామని.. అతి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

    Trending Stories

    Related Stories