పాక్ మద్దతుదారుల నిజస్వరూపాలను బయట పెట్టినందుకు.. హిందూ విద్యార్థిని టార్గెట్ చేశారు..!

భారత్-పాక్ మ్యాచ్ అనంతరం కొంతమంది బాలిక విద్యార్థులు పాకిస్తాన్ కు అనుకూల నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత షేర్ ఈ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీనగర్ (స్కిమ్స్)లో చదువుతున్న అనన్య జమ్వాల్ అనే హిందూ విద్యార్థిని ఇస్లామిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించినందుకు స్కిమ్స్ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్న వీడియోను లీక్ చేయడం వెనుక జమ్వాల్ హస్తం ఉందని ఆరోపించారు. ఆ వీడియోను షేర్ చేసింది జమ్వాల్ కాదని తేలినా కూడా ఆమెను టార్గెట్ చేస్తూ నినాదాలు చేశారు. కాలేజీలో ఏం జరుగుతోందో చూపిస్తూ.. పాకిస్తాన్‌కు మద్దతిచ్చే వారి నిజ స్వరూపం బయటకు వచ్చింది. పాక్ అనుకూల నినాదాలు చేసిన వారిపై యూఏపీఏ ప్రయోగించినట్లు తెలుస్తోంది.
అనన్య జమ్వాల్ సోషల్ మీడియాలో తాను ఎవరి గురించి బయట పెట్టలేదని.. తాను పోలీసులకు సమాచారం అందించలేదని పోస్టు పెట్టింది. దయచేసి తన గురించి తప్పుడు సమాచారాన్ని ఎవరూ షేర్ చేయకండి అని అనన్య తెలిపింది. ఆమె గురించి నకిలీ సమాచారాన్ని పంచుకోవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతూ జమ్వాల్, “పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకుంటున్న దేశద్రోహులు బహిర్గతమయ్యారు. దేశద్రోహులకు మద్దతిస్తున్న వారికి నేను ఎదురు నిలిచాను, ఆ తర్వాత వారంతా నన్ను రకరకాలుగా వేధించడం ప్రారంభించారు. నేను వాటిని మాత్రమే ఎదుర్కొన్నాను. నేను ఎవరినీ బహిర్గతం చేయలేదు మరియు నేను ఏ పోలీసు ఇన్ఫార్మర్ కాదు. వారికి వారే తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారు” అని తెలిపింది. “తప్పుడు సమాచారాన్ని పంచుకోవద్దని దయచేసి వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను” అని ఆమె చెప్పుకొచ్చింది.

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఆమెపై వరుస దాడులకు పాల్పడ్డారు. “స్కిమ్స్ ఎఫ్ఐఆర్ & UAPA వెనుక ఉన్న పోలీసు ఇన్ఫార్మర్ మరియు ప్రధాన నిందితురాలు RSS సభ్యురాలు అనన్య జమ్వాల్‌గా గుర్తించబడింది.” అంటూ కొందరు ట్వీట్లు చేశారు. ఆమె ఫోటోలను పెట్టి.. విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఆదివారం నాడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించడంతో సంబరాలు చేసుకున్న కశ్మీర్‌లోని శ్రీనగర్ కాలేజీల్లోని విద్యార్థులపై UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) యాక్ట్, భారత శిక్షాస్మృతిలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు వేర్వేరు సంఘటనలలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఒకటి సౌరాలోని SKIMS ఆసుపత్రి హాస్టల్లో చోటు చేసుకోగా.. మరొకటి శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC)లోని హాస్టల్లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ గెలవగానే హాస్టల్లో ఉంటున్న ఎంబీబీఎస్ మరియు ఇతర డిగ్రీలు చదువుతున్న విద్యార్థులు ‘ఆజాదీ’ నినాదాలతో సహా పలు నినాదాలు చేశారు. పాకిస్తాన్‌తో భారతదేశం ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటూ టపాసులు పేల్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ కేసుల్లో బుక్ అయిన వాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కాకుండా నిషేధించబడతారని నివేదికలు చెబుతున్నాయి.
