More

    ప్రభుత్వ పాఠ్యాంశాల్లో హిందూ మత గ్రంథాలు.. మధ్యప్రదేశ్ సీఎం సంచలన నిర్ణయం..!

    దేశంలో గత కొంత కాలంగా హిందూ మతంపై దాడులు.. హిందూ దేవుళ్లను అవమానిచడం.. హిందూ పండుగలను హేళన చేయటం.. హిందూ గ్రంథాలను చించివేయటం వంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గీత, రామచరితమానస్, వేదాలు వంటి హిందూ మత గ్రంథాలను బోధించనున్నట్లు ఆసక్తికర ప్రకటన చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భోపాల్‌లోని ఓల్డ్ క్యాంపియన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

    ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్గీత లాంటివి అమూల్యమైన పుస్తకాలని, మానవుడిని నైతికంగా, సంపూర్ణంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ గ్రంథాలకు ఉందని సీఎం శివరాజ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మన మత గ్రంధాలన బోధించాలని ముఖ్యమంత్రిగా తాను చెబుతున్నానని అన్నారు. గీతా, రామాయణం, రామచరితమానస్‌ల సారాంశాన్ని బోధిస్తామనీ సీఎం అన్నారు. ఇతర సబ్జెక్టులతో పాటు ఈ మతపరమైన పుస్తకాలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

    మన ప్రతి శ్వాసలో రాముడు ఉన్నాడని, రాముడు లేకుండా ఈ దేశం శూన్యమని తాను వారికి చెప్పాలనుకుంటున్నానని అన్నారు. రాముడు మన ఉనికి, రాముడు మన జీవితం, రాముడు మన దేవుడు, రాముడు గుర్తింపు అని అన్నారాయన. రామ్‌చరిత్ మానస్‌పై బీజేపీయేతర నేతలు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రకటన చేశారు .

    రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్భగవద్గీత ఇలా ఎన్నో అమూల్యమైన పుస్తకాలు మనవేనని, మనిషిని నైతికంగా తీర్చిదిద్దే సత్తా ఈ పుస్తకాలకు ఉందని సీఎం అన్నారు. అందుకే ముఖ్యమంత్రిగా ఉన్న తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మన మత గ్రంధాల విద్యను అందజేస్తామని చెబుతున్నానన్నారు. రామాయణమైనా, మహాభారతమైనా, వేదాలైనా, పురాణాలైనా, ఉపనిషత్తులైనా మన అమూల్యమైన గ్రంథాలని తెలిపారు. ఈ గ్రంథాలు మానవుని నైతికంగా, సంపూర్ణంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నారు. ఈ పవిత్ర గ్రంథాలను బోధించడం ద్వారా పిల్లలలో నైతిక, పరిపూర్ణ సిద్దిస్తుందని అయన తెలిపారు.

    వెండి పళ్లెంలో పెట్టుకుని బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇవ్వలేదని, ఎందరో విప్లవకారులు బలిదానం వల్ల స్వాతంత్ర్య సిద్దించిందనీ, స్వాతంత్య్రం సాధించిన ఘనత ఒక్క కుటుంబానికే దక్కిందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఖుదీరామ్ బోస్, సర్దార్ పటేల్ సహా అనేక మంది స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు కృషి చేశారనీ, నేతాజీ పాదాల దగ్గర సాక్ష్యం చెబుతున్నానని సీఎం అన్నారు.

    మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లో హిందూ గ్రంథం రామచరితమానస్ వివాదం రచ్చరచ్చ అవుతోంది. ఇటీవల బీహార్లో ఆర్జేడీ నేత రామచరిత్ మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య కూడా రామచరిత మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వామి ప్రసాద్ మౌర్య ఉత్తర్ ప్రదేశ్ లో ఓబీసీ నాయకుడు. రామచరితమానస్ లోని కొన్ని భాగాలు కుల ప్రాతిపదికను సమాజంలో కొన్ని కులాలను అవమానపరుస్తున్నాయని అన్నాడు. అందుకు రామచరితమానస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ పాలనలో మహిళలకు చదవడం రాయడం హక్కు వచ్చిందని.. బ్రిటీస్ కాలంలో దళితులు చదవడం, రాయడం హక్కును పొందారని.. దేశ సంపందలో 60 శాతానికి పైగా 5 శాతం భారతీయులు మాత్రమే కలిగి ఉన్నారని వ్యాఖ్యానించారు. రామచరితమానస్ పై అయన చేసిన వ్యాఖ్యలతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో మధ్యప్రదేశ్ లో హిందూ గ్రంథాలను పాఠశాలలో పాఠాలుగా భోదించాలని ప్రభుత్వం నిర్ణయించటం పై హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories